అంపశయ్య బాగా కుదిరింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంపశయ్య నవల గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత నవీన్ 1969లో రాసిన ఈ నవల ఆయన ఇంటిపేరుగా మారిపోయింది. ఆ నవల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘క్యాంపస్ - అంపశయ్య’. దర్శకుడు ప్రభాకర్ జైని ప్రధాన పాత్రలో నటించడంతోపాటు చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్యాంకుమార్, పావని జంటగా నటించిన సినిమాకు సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేశారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీషు భాషలలో ఈనెలాఖరుకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులకు ప్రిమియర్ షోను ప్రదర్శించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను తెలిపారు. ముందుగా ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ, కాలేజీ రోజుల్లో చదువుకున్న అంపశయ్య తెలుగు జాతిని ఓ ఊపు ఊపిందని, ప్రయోగాత్మక నవలగా పేరుపొందిన అంపశయ్యను సినిమాగా ఎలా తీశారు అనే ఉత్సాహంతో తాను వచ్చానని తెలిపారు. నవలను సాధ్యమైనంతవరకూ చెడగొట్టకుండా రూపొందించారని, ద్వితీయార్థం చాలా బాగా వచ్చిందని, ప్రయోగంగా రూపొందించిన ఈ చిత్రం తప్పక విజయవంతం కావాలని ఆయన కోరుకున్నారు. ఎంతోమంది విద్యార్థినీ విద్యార్థులు తల్లిని క్యాంటీన్‌గా, తండ్రిని ఎటిఎమ్‌గా భావించే ఈ రోజుల్లో, 50 ఏళ్ళ క్రితం విద్యార్థుల జీవితం ఎలా వుంటుందో తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడాలని, ఎంతోమంది పేద, మధ్యతరగతి కుటుంబాల జీవితాలకు అద్దంపట్టిన ఆ నవల సినిమాగా చిత్రీకరించిన విధానం చాలా బాగుందని తెలిపారు. రచయిత నవీన్ అంటే తమకెంతో గౌరవమని, ఆయన రాసిన నవల ఇన్నాళ్లకు దృశ్యరూపంగా మారి తెలంగాణలో మంచి చిత్రాలు తీయడానికి అన్ని సదుపాయాలు వున్నాయని ఈ సినిమా చెబుతోందని అన్నారు. ప్రభాకర్ జైని ఈ చిత్రాన్ని రూపొందించడం ఓ సాహసంగా తాను భావిస్తున్నానని రచయిత నవీన్ అన్నారు. 45 ఏళ్ళు దాటిన ఈ నవలను సినిమాగా తీయడానికి ఆయన ఆసక్తిచూపించారని, కథలో మానసిక సంఘర్షణ ఎక్కువగా వుంటుంది కనుక సినిమాగా బావుంటుందో లేదో అని ప్రయత్నాలను విరమించుకున్నామని, అయితే చాలా రోజుల తరువాత ఈ సినిమా చూసి తాను సంతోషంగా ఉన్నానని ఆయన తెలిపారు. నవలలో వున్న స్ఫూర్తి ఎక్కడా దెబ్బతినకుండా చాలా రియలిస్టిక్‌గా దర్శకుడు ఈ చిత్రాన్ని తీసిన విధానం, నటీనటులు నటించిన పద్ధతి తనకు బాగా నచ్చిందని, నవలకు పూర్తి న్యాయం జరిగిందని ఆయన వివరించారు. నవలలోని ఆత్మను ఆవిష్కరించడానికి తమకు మూడేళ్లు పట్టిందని, సరైన నటీనటులు దొరకడంతో తన ప్రయత్నం విజయవంతమైందని దర్శకుడు ప్రభాకర్ జైని తెలిపారు. వ్యాపారాత్మక ధోరణితో కమర్షియల్ ఫార్మాట్‌లో తీసే ఉద్దేశ్యం లేదు కనుక, సాధ్యమైనంతవరకూ 1965-70ల కాలంలో వున్న తెలంగాణ గ్రామీణ జీవితాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశామని, కమర్షియల్ పరంగా కాకపోయినా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు చందూలాల్ జైన్, ఆకెళ్ల రాఘవేంద్ర తదితరులు సినిమాను ప్రశంసించారు.