వెయ్య కోట్ల డీల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ క్రేజ్ మామూలుగా లేదు. ఆయన నటిస్తున్న సినిమాల రికార్డులను తానే దాటేస్తూ.. నిర్మాతలకు పంట పండిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ‘సుల్తాన్’ సినిమా 200 కోట్ల మార్కెట్‌ను వారంలో క్రాస్ చేసింది. ‘బాహుబలి’ తరువాత సల్మాన్ తన రికార్డును పదిలపరచుకున్నాడు. అయితే ఈ విషయంలో నిజంగా సల్మాన్ గ్రేట్ అని చెప్పాలి. ఎందుకో తెలుసా సల్మాన్ తదుపరి సినిమాల సాటిలైట్ హక్కులను ఏకంగా 1000 కోట్లకు అమ్మేశాడు! ఇటీవలే హృతిక్ రోషన్ తన నెక్స్ట్ సినిమా శాటిలైట్ హక్కులను 550 కోట్లకు అమ్మిన విషయం తెలిసిందే. ఇదే రికార్డు అనుకుంటే దాన్ని మించిన రికార్డ్‌తో సల్మాన్ దుమ్ములేపాడు. ఒక హీరో తన తదుపరి సినిమాల శాటిలైట్ హక్కులను ఇంత భారీ రేటుకు అమ్మడం నిజంగా రికార్డే. ఈ విషయంలో సల్మాన్‌ను కొట్టే హీరో ఉన్నాడా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.