కబాలి టార్గెట్ 500 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కబాలి సినిమా విడుదల తేదీ దగ్గరపడుతున్నకొద్దీ అభిమానుల్లో ఉత్సాహం ఎక్కువైంది. ప్రపంచ వ్యాప్తంగా కబాలి ప్రభంజనం మామూలుగా లేదు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌తో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కూడా గంటల్లోనే ఖాళీ అవుతున్నాయి. పా.రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను అభిషేక్ పిక్చర్స్ స్వంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు తెలిపారు నిర్మాతలు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదలవుతున్న ఈ సినిమా ఖచ్చితంగా 500 కోట్లు వసూలు చేస్తుందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే ఇండియాతోపాటు ఇతర దేశాల్లో కూడా ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.