హను దర్శకత్వంలో అఖిల్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అఖిల్’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అఖిల్. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అంతే భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక ఆ సినిమా విడుదలై చాలారోజులు అవుతున్నా కూడా ఇంకా అఖిల్ రెండో సినిమా మాత్రం కన్ఫర్మ్ కాలేదు. ఇప్పటికే పలువురి దర్శకుల పేర్లు వినిపిస్తున్నా కూడా ఏది ఓకే అవ్వడం లేదు. ఈమధ్యే ‘ఊపిరి’ ఫేమ్ వంశీ పైడిపల్లితో సినిమా ఉంటుందని, వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరుపుతున్నామని అప్పట్లో నాగార్జున చెప్పాడు కూడా. కానీ అదీ కొలిక్కి రాలేదు. లేటెస్ట్‌గా అఖిల్‌తో సినిమా చేయడానికి రెడీ అయ్యాడట హను రాఘవపూడి. ఇటీవలనే నాని హీరోగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమాతో మంచి హిట్ అందుకున్న హను చెప్పిన కథ నచ్చిందట. అందుకే నాగార్జున కూడా ఓకే చెప్పాడని సమాచారం. ఆ దర్శకుడితో అయితే పెద్దగా అంచనాలు ఉండవని, పైగా అఖిల్‌ని కూడా కొత్తగా చూపిస్తాడని భావించి అతనితో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారట.