రాణిగారి బంగళా ఆడియో సక్సెస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆనంద్ నంద, రేష్మిగౌతమ్, శివకృష్ణ ప్రధాన తారాగణంగా వి సినీ స్టూడియోస్ పతాకంపై బాలాజీ నాగలింగం సమర్పణలో డి.దివాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రాణిగారి బంగళా’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయి. ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో సీడీ విడుదలైంది. ఆడియో సక్సెస్‌మీట్ హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ, ఈ సినిమా పేరే వైవిధ్యంగా అందరికీ ఆసక్తి కలిగిస్తోందని, తప్పక విజయవంతం అవుతుందని తెలిపారు. దివాకర్ ఈ చిత్రాన్ని ఆసక్తికరంగా తెరకెక్కించారని, తాను ఈ చిత్రంలో కాటికాపరిగా నటించానని, పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నట్లుగా నటుడు శివకృష్ణ అన్నారు.
థ్రిల్లింగ్, హారర్ కథనంతో తెరకెక్కిన ఈ చిత్రంలో అందరూ బాగా నటించారని, ఈనెల 29న సుమారు 200 థియేటర్లలో ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని దర్శకుడు డి.దివాకర్ అన్నారు. కొత్తవాడైనా దర్శకుడు ఈ చిత్రాన్ని బాగా రూపొందించారని, ముందు ముందు అతనికి మంచి అవకాశాలు వస్తాయని, నేపథ్య సంగీతం ఈ చిత్రానికి హైలెట్‌గా నిలుస్తుందని చిత్ర సమర్పకులు బాలాజి నాగలింగం అన్నారు. కార్యక్రమంలో తుమ్మలపల్లి సత్యనారాయణ, కె.వి.వి.సత్యనారాయణ చిత్ర విశేషాలను తెలిపారు.