తెలుగు సావిత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై తిరుగులేని ఇమేజ్‌ని సొంతం చేసుకుంది మహానటి సావిత్రి. ఆమె తన జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఉన్నాయి. ఆమె జీవిత కథతో ఓ సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన తన రెండో ప్రయత్నంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌తో సహా అన్ని కార్యక్రమాలు పూర్తికాగా, ప్రస్తుతం హీరోయిన్ అనే్వషణలో ఉన్నాడట. మహానటి సావిత్రి పేరుతో తెరకెక్కే ఈ సినిమా కోసం ఇప్పటికే పలువురు హీరోయిన్లతో చర్చలు జరిపిన నాగ్‌అశ్విన్, బాలీవుడ్ నటి విద్యాబాలన్‌ను సంప్రదించినట్టు తెలిసింది. రియల్ లైఫ్ కథలతో తెరకెక్కే సినిమాలకు ఆమె కేరాఫ్ అడ్రస్‌గా మారింది. ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్నాయని, ఈ సినిమా చేయడానికి ఆమె ఆసక్తి చూపిస్తున్నట్టు తెలిసింది. మహానటి సావిత్రి అంటే, ఆమెకు కూడా ఇష్టమట. దాంతో ఈ సినిమా చేయడానికి విద్యాబాలన్ ఓకె చెప్పే అవకాశాలు మెండుగా వున్నాయి.