సందేశాత్మకం ‘లైఫ్‌కి ప్లాట్‌ఫాం టీనేజ్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జై చిరంజీవ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై కొండపల్లి పర్వతాలు సమర్పణలో తన్నీరు చిరంజీవి దర్శకత్వంలో సకినాన భూలక్ష్మి నిర్మించిన చిత్రం ‘లైఫ్‌కి ప్లాట్‌ఫాం టీనేజ్’. ఉమ,రాఘవ, ప్రకాష్, శశాంక్, రాహుల్ తదితరులు నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 13న విడుదల చేయడానికి సిద్ధమైన నేపథ్యంలో దర్శకులు తన్నీరు చిరంజీవి మాట్లాడారు.
సందేశాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించామని, యూత్‌కు బాగా నచ్చే చిత్రమని, టీనేజ్‌లో తెలిసీ తెలియక చేసే పనులవల్ల అనర్థాలు జరుగుతాయని, సరైన జాగ్రత్తలు తీసుకుంటే ఆ టీనేజ్ జీవితానికి సరైన ప్లాట్‌ఫాం అవుతుందనే కానె్సప్టుతో రూపొందించామని ఆయన తెలిపారు. నిర్మాత భూలక్ష్మి మాట్లాడుతూ, ఈ చిత్రంలో యువతరానికి కావలసిన అన్ని అంశాలు ఉన్నాయని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉందన్నారు.