దేవెగౌడ మనవడితో జాగ్వార్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చన్నాంబిక ఫిలిమ్స్ పతాకంపై మాజీ ప్రధానమంత్రి హెచ్.డి.దేవగౌడ మనుమడు నిఖిల్‌కుమార్ కథానాయకుడుగా ఎ.మహదేవ్ దర్శకత్వంలో అనిత కుమారస్వామి రూపొందిస్తున్న చిత్రం జాగ్వార్. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్న జగపతిబాబు మాట్లాడుతూ, నిఖిల్ ఈ చిత్రంలో హార్డ్‌వర్క్ చేశాడని, మంచి థీమ్ దొరికినందున ఈ సినిమా అందరికీ నచ్చేలా రూపొందిందని తెలిపారు. హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా ఈ సినిమాకు పనిచేయడం మరో విశేషమని, ఇటువంటి చిత్రంలో తాను నటించడం ఆనందంగా వుందని అన్నారు. తెలుగంటే ఇష్టమైన తనకు ఎక్కువ తెలుగు సినిమాలు నచ్చుతాయని, మంచి కథ దొరకడంతో దర్శకుడు మహదేవ్ ఈ సినిమాని అద్భుతంగా తీర్చిదిద్దారని హీరో నిఖిల్‌కుమార్ అన్నారు. పరమహంస కెమెరా పనితనం, థమన్ సంగీతం హైలెట్‌గా ఉంటాయని, తనవరకు తాను మంచి ఎటెమ్ట్ చేసినట్లుగా భావిస్తున్నానని, తెలుగు ప్రేక్షకులు ఆశీర్వదించాలని ఆయన కోరుకున్నారు. నిఖిల్ ఈ సినిమాకోసం చాలా కష్టపడ్డాడని, సినిమా పూర్తికావస్తోందని, తెలుగు, కన్నడ భాషల్లో ద్విభాషా చిత్రంగా విడుదల చేయనున్నామని దర్శకుడు మహదేవ్ తెలిపారు. తెలుగు నటీనటులు ఎక్కువగా ఉండడంవల్ల ఇది తెలుగు సినిమాగానే తాము భావిస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో టి.సుబ్బరామిరెడ్డి, ఎస్.ఎస్.్థమన్, హెచ్.డి.కుమారస్వామి, ఘంటా శ్రీనివాసరావు, సి.కళ్యాణ్, విజయేంద్రప్రసాద్, అల్లు అరవింద్ తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. దీప్తి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు, రఘుబాబు, బ్రహ్మానందం, సంపత్, ఆదిత్యమీనన్, అవినాష్, వినాయక్ జోషి, ప్రశాంత్, సుప్రీత్‌రెడ్డి, రావు రమేష్, రమ్యకృష్ణ, తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సమర్పణ: హెచ్.డి.కుమారస్వామి, కథ: విజయేంద్రప్రసాద్, కెమెరా: మనోజ్ పరమహంస, సంగీతం: థమన్, పాటలు: రామజోగయ్యశాస్ర్తీ, నిర్మాత: అనిత కుమారస్వామి, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: ఎ.మహదేవ్.