నేనొస్తా టీజర్ విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జ్ఞాన్, సూర్యశ్రీనివాస్, ప్రియాంక ప్రధాన పాత్రల్లో పరంద్ కళ్యాణ్ దర్శత్వంలో రైజింగ్ డ్రీమ్స్ ప్రొడక్షన్స్ పతాకంపై భాషా మజహర్ నిర్మిస్తున్న చిత్రం ‘నేనొస్తా’. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్ర ట్రైలర్‌ను ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాధ్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, టీజర్ బాగుందని, మంచి క్వాలిటీతో తెరకెక్కించారని, ముఖ్యంగా పోస్టర్లు చూస్తుంటే సినిమాపై అంచనాలను పెంచుతున్నాయని, తనకు థ్రిల్లర్ సినిమాలంటే ఇష్టమని, ఈ సినిమా కూడా ఆ కోవకే చెందిందని అన్నారు. మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, టీజర్ విడుదల చేసిన పూరి జగన్నాధ్‌కు ధన్యవాదాలని, ఈ చిత్రం ఆద్యంతం థ్రిల్లర్ అంశాలతో తెరకెక్కే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని, ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కించామని, థియేటర్‌లో ప్రేక్షకులు ఎంజాయ్ చేసే అన్ని అంశాలున్నాయని అన్నారు. ప్రస్తుతం సెన్సార్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, త్వరలోనే ఆడియోను విడుదల చేస్తామని అన్నారు. ఈ చిత్రానికి ఎడిటింగ్:ఎస్.జె.శివకిరణ్, సంగీతం:అనురాగ్ వినీల్, కెమెరా:శివారెడ్డి, మాటలు, రచన, సహకారం:్భషా మజహర్, నిర్మాత:్భషా మజహర్, దర్శకత్వం:పరంద్ కళ్యాణ్.