సంతోషం అవార్డుల ప్రదానం 14న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పద్నాలుగేళ్లుగా ఏళ్ళుగా తెలుగు సినీ పరిశ్రమలో సంతోషం అవార్డుల పేరిట కొండేటి సురేష్ అందిస్తున్న విషయం తెలిసిందే. సంతోషం సినీ వారపత్రిక ఆధ్వర్యంలో అందిస్తున్న ఈ అవార్డు వేడుకలు ఈనెల 14న గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరగనున్నాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో హీరో నిఖిల్, కాథరీన్, తమన్, శివాజీరాజా, సురేష్ కొండేటి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హీరో నిఖిల్ టైటిల్ సాంగ్‌ను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ- నా చిన్నప్పటినుంచీ ఈ అవార్డు వేడుకలను చూస్తున్నాను. సంతోషం 14 ఏళ్ళు పూర్తిచేసుకోవడం ఆనందంగా వుంది. నంది, ఫిలింఫేర్ అవార్డుల తరువాత ఆ స్థాయిలో జరుగుతున్న వేడుక ఇది అన్నారు. తమన్ మాట్లాడుతూ- పరిశ్రమలో అందరి సపోర్టు సురేష్‌కు ఉంది. చాలామంది నటీనటులను ఎంకరేజ్ చేస్తూ ఈ అవార్డులను అందిస్తున్నారు. తప్పకుండా ఈ కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ కావాలి అన్నారు. సురేష్ కొండేటి మాట్లాడుతూ- నేను బతికున్నంతకాలం ఈ అవార్డు వేడుకలను నిర్వహిస్తాను. నాకు ఎవరూ సహాయం చేయకపోయినా ఫర్వాలేదు కానీ చెడగొట్టవద్దని కోరుకుంటున్నాను. సంతోషం పత్రిక ప్రారంభించిన రెండవ ఏడాది బాలకృష్ణ ఈ పేరుతో అవార్డులు ఇస్తే బాగుంటుందని చెప్పారు. ఆయన మాటతో ఈ అవార్డులను స్టార్ట్ చేశాను. అలాగే చిరంజీవి, మిగతా నటీనటుల సపోర్టు అందించారు. ఈ నెల 14న జరిగే ఈ వేడుకలను గ్రాండ్‌గా సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నానన్నారు.