గరంగరంగా ప్రయోగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేమకావాలి’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమై
ఆ తరువాత పలు చిత్రాలతో హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆది. సాయికుమార్ తనయుడిగా ఎంట్రీ ఇచ్చినా, హీరోగా మంచిపేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘గరం’ చిత్రంలో నటిస్తున్నాడు. మదన్ దర్శకత్వంలో
తెరకెక్కుతున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు
సిద్ధవౌతోంది. ఈరోజు ఆది పుట్టినరోజు సందర్భంగా ఆయనతో మాటామంతీ...
ఆలస్యానికి అదే కారణం
‘గరం’ ఈ సినిమా ఆలస్యమవ్వడానికి వేరే కారణాలంటూ ఏమీ లేవు. కథను బాగా నమ్మాం కాబట్టి దాన్ని పర్‌ఫెక్ట్‌గా తెరకెక్కించాలనే విషయంలో ఆలస్యమైంది. దానికితోడు ప్రముఖ నటీనటులందరూ నటించడంతో డేట్ల సమస్యలవల్ల కూడా ఆలస్యమైంది. కానీ మొత్తానికి సినిమా బాగా వచ్చింది.
గరం గరంగా
ఈ చిత్రంలో నేను వరాలబాబు అనే పాత్ర చేస్తున్నాను. ఇది గోదావరి యాసలో వుంటుంది. ఇలాంటి ప్రయోగం చేయడం మొదటిసారి. ఇక హీరోగా కోపం వస్తే కొట్టాలి, ఏదైనా చేయాలనిపిస్తే చేసేయాలి అనే తరహాలో ఎనర్జీగా సాగే పాత్ర. పాత్రలో స్పార్క్‌నెస్ వుండడంవల్ల ఈ చిత్రానికి టైటిల్ అలా పెట్టాం.
యాక్షన్ సినిమా కాదు
‘గరం’ అనగానే ఇదేదో పక్కా యాక్షన్ సినిమా అనుకునేరు, కానే కాదు. మాస్ అంశాలతో వుండే మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. హీరో తండ్రితో గొడవపడి బైటికొచ్చిన తరువాత ఏం జరిగింది అనే ఆసక్తికర అంశాలతో తెరకెక్కించిన చిత్రం ఇది. ముఖ్యంగా కథపై నాకు మంచి నమ్మకం వుంది.
మిగతా పాత్రల్లో
ఇందులో హీరోయిన్ ఆదాశర్మ నటిస్తోంది. తనది సిటీ అమ్మాయి పాత్ర. చాలా బాగా చేసింది. అలాగే, బ్రహ్మానందం పాత్ర కూడా అందరినీ ఆకట్టుకుంటుంది. ఇలాగే చాలామంది ప్రముఖ నటీనటులు ఉన్నారు.
సెన్సిబుల్ దర్శకుడు
మదన్ చాలా సెన్సిబుల్ దర్శకుడు. కథలో ఇలాంటి అంశాల్ని బాగా డీల్ చేశాడు. సినిమా చూసుకున్నపుడు చాలా ఆనందమేసింది. ఖచ్చితంగా మాకు మరో మంచి హిట్ సినిమా దక్కిందని భావిస్తున్నాం.
ప్రొడక్షన్‌లోకి
నిజానికి ఈ సినిమాకు రాజశేఖర్ అనే అతను నిర్మాతగా చేశాడు. కానీ కొన్ని కారణాలవల్ల ఆయన ఈ ప్రాజెక్టును వదిలేయడంతో నాన్న ఆ బాధ్యతల్ని తీసుకున్నాడు. దానికి కారణం కథను బాగా నమ్మడంతో ఈ సినిమాకు నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వాల్సి వచ్చింది. ఇకపై కూడా ఈ బ్యానర్‌ను (శ్రీనివాసాయి ఫిలింస్) బ్యానర్‌ను కంటిన్యూ చేస్తాం. ఈ బ్యానర్‌లో మంచి సినిమాలు చేయాలని వుంది.
త్వరలోనే
‘గరం’ సినిమా త్వరలోనే విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఇటీవలే సెన్సార్ వాళ్లు కూడా బావుందని మెచ్చుకున్నారు. ముఖ్యంగా మంచి రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్నా.

అదృష్ట లక్ష్మి
‘గరం’ సినిమా ప్రారంభం తరువాత పెళ్లైంది. ఇపుడు పాప పుట్టిన తరువాత సినిమా రిలీజ్ అవుతోంది. పెళ్ళైన తరువాత నా మొదటి సినిమా ఇది. పాప పుట్టడంతో ఇంట్లో అందరూ అదృష్ట లక్ష్మి పుట్టిందని అంటున్నారు.
తదుపరి చిత్రాలు
ప్రస్తుతం ‘చుట్టాలబ్బాయి’ సినిమా 40 శాతం షూటింగ్ పూర్తయింది. వీరభద్రం దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా మంచి ఎంటర్‌టైనర్‌గా వుంటుంది. అలాగే మరో రెండు కథలు చర్చల దశలో వున్నాయి.

-శ్రీ