15న ఇంకొక్కడు పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విక్రమ్, నయనతార జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఇంకొక్కడు’. తమిళంలో ‘ఇరుమగన్’ పేరుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆర్.కె.్ఫలింస్ పతాకంపై నీలం కృష్ణారెడ్డి తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈనెల 15న ఆడియోను విడుదల చేస్తున్న సందర్భంగా నిర్మాత వివరాలు తెలియజేస్తూ,‘శివపుత్రుడు, అపరిచితుడు, ఐ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో హీరోగా గుర్తింపు తెచ్చుకున్న విక్రమ్ మరో విభిన్న ప్రయోగంతో చేస్తున్న చిత్రమిది. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొల్పిన ఈ చిత్రంలోని పాటలను హైదరాబాద్‌లో విడుదల చేస్తున్నాం. హేరిష్ జయరాజ్ అందించిన పాటలు సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. త్వరలోనే చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు.

చిత్రం విక్రమ్, నయనతార