ఆది కొత్తగా కన్పిస్తాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, నమితా ప్రమోద్ జంటగా ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీఐశ్వర్య లక్ష్మి పతాకంపై వీరభద్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘చుట్టాలబ్బాయి’ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 19న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు వీరభద్రమ్‌తో ఇంటర్వ్యూ...
చుట్టాలబ్బాయి ఏం చేస్తాడు?
- పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ఇది. చుట్టాలబ్బాయి హైదరాబాద్‌లో రికవరీ బాబ్జిగా సరదాగా వుండే కుర్రాడు. అలాంటి కుర్రాడు చుట్టాలబ్బాయిగా వెళ్లి ఏం చేశాడనేదే కథ.
ఆది హీరోగానే అనుకున్నారా?
- కథ అనుకున్నపుడు వేరే ఇద్దరు హీరోలను అనుకున్నాం కానీ, అది కుదరలేదు. దాంతో ఆది అయితే బావుంటుందని తనని కలిశాం. కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాడు. ఈ సినిమా ఖచ్చితంగా తనకు మంచి బ్రేక్‌నిస్తుంది. పూలరంగడు, అహనా పెళ్లంట తరహాలో సాగే సినిమా ఇది.
బడ్జెట్ విషయంలో
ఎక్కువైందని తెలిసింది?
- అలాంటిదేం లేదు. ఒక కథ అనుకున్నపుడే దాని బడ్జెట్, హీరో మార్కెట్‌ను బట్టి ప్లాన్ చేస్తాం. ఈ సినిమా కూడా అనుకున్న బడ్జెట్‌లోనే పూర్తిచేశాం. ముఖ్యంగా ఆది కెరీర్‌లో భారీ బడ్జెట్ చిత్రమని చెప్పాలి. సినిమా నిర్మాణం విషయంలో ముఖ్యంగా ప్రొడక్షన్ ఖర్చులు బాగా పెరగడంతో ఏ సినిమాకైనా బడ్జెట్ ఎక్కువే అవుతుంది.
ఆడియో రెస్పాన్స్ ఎలా వుంది?
- తమన్ అందించిన పాటలు సూపర్‌హిట్‌గా నిలిచాయి. ఇటీవలే సరైనోడు సినిమాతో మంచి మ్యూజికల్ హిట్‌ను అందుకున్న తమన్ ఈ సినిమాతో దాన్ని కంటిన్యూ చేశాడు. అలాగే రీరికార్డింగ్ కూడా అద్భుతంగా వుంటుంది.
హీరోయిన్ నమిత గురించి?
- తను మలయాళంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్. ఈ కథ కోసం కొత్త అమ్మాయి అయితేనే బాగుంటుందని ఆమెతో చేయించాం. చక్కగా చేసింది. ముఖ్యంగా ఆది-నమితాప్రమోద్‌ల కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయింది.
హైలెట్స్ ఏంటి?
- మంచి కథ, దానికి తగ్గ టెక్నీషియన్లతో తెరకెక్కించిన సినిమా ఇది. మ్యూజిక్, ఫొటోగ్రఫి, ఎడిటింగ్ అన్నీ బాగా కుదిరాయి. ఈ రోజుల్లో ప్రేక్షకుడు సినిమాకు రావాలంటే చాలా ఆలోచిస్తున్నాడు. బావుందని టాక్ వస్తేనో, ట్రైలర్ నచ్చితే తప్ప రావడంలేదు. ఇంత ఖర్చుపెట్టి థియేటర్‌కు వెళ్లి సినిమా చూడ్డానికి ఆలోచిస్తున్నారు. వారిని థియేటర్ వరకూ రప్పించాలంటే ఎక్కడా కాంప్రమైజ్ కాకూడదు.
తండ్రీ కొడుకులను
ఒకే సినిమాలో చూపించారు?
- అది అనుకోకుండా కుదిరింది. పోలీస్‌స్టోరీ సినిమాతో సాయికుమార్‌కు మంచి ఫాలోయింగ్ వుంది. ప్రస్తుతం ఆయన మంచి పాత్రలు చేస్తూ ఆకట్టుకుంటున్నాడు. అదే తరహాలో ఇందులో కీరోల్ చేశాడు. తప్పకుండా తనకు మంచి ఇమేజ్ వస్తుంది. అలాగే పోసాని, పృధ్వీ తదితరుల నటన ఆకట్టుకుంటుంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
- ప్రస్తుతానికి రెండు ప్రాజెక్టులు చర్చల దశలో వున్నాయి. ఒక సినిమా ఇదే బ్యానర్‌లో వుంటుంది, ఒక స్టార్ హీరోతో ప్లాన్ చేస్తున్నాం. మరో సినిమా వేరే బ్యానర్‌లో చేస్తా.

-శ్రీ