చుట్టాలబ్బాయి నచ్చాడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది కెరీర్‌లోనే హయ్యస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు సాధించిన చిత్రం ‘చుట్టాలబ్బాయి’. దాదాపు 350 థియేటర్లలో విడుదలైన ఈ అబ్బాయి అందరికీ నచ్చాడు అని నటుడు సాయికుమార్ తెలిపారు. ఆది, నమితాప్రమోద్ జంటగా శ్రీ ఐశ్వర్యలక్ష్మీ మూవీస్, ఎస్‌ఆర్‌టి మూవీస్ పతాకాలపై వీరభద్రమ్ దర్శకత్వంలో వెంకట్ తలారి, రామూ తాళ్ళూరి రూపొందించిన ‘చుట్టాలబ్బాయి’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన విజయోత్సవ కార్యక్రమం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా నటుడు సాయికుమార్ మరిన్ని విశేషాలు తెలుపుతూ- సినిమా ప్రథమార్థం ఎంటర్‌టైన్‌మెంట్‌తో, ద్వితీయార్థంలో తన, పృధ్వీ, అలీ కామెడీతో ఆకట్టుకున్నాయని తెలిపారు. ప్రేక్షకులనుండి ఆది నటనకు ప్రశంసలు లభిస్తుండడం ఆనందంగా వుందని, ఓ కమర్షియల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ పంథాలో తెరకెక్కించిన వీరభద్రమ్‌ను తాను అభినందిస్తున్నానని నిర్మాతలు కూడా ఎక్కడా రాజీపడకుండా నిర్మాణ విలువలను కాపాడారని ఆయన అన్నారు. తొలి టీజర్‌నుంచే ఈ సినిమాకు మంచి టాక్ లభించిందని, వ్యాపారాత్మకంగా కూడా మంచి ఆదరణ లభించిందని, ఆడియో విజయం తరువాత ఎక్కడికెళ్లినా చుట్టాలబ్బాయి గురించి అడిగారని దర్శకుడు వీరభద్రమ్ అన్నారు. నైజాం, ఆంధ్ర, రాయలసీమనుంచి రెస్పాన్స్ లభిస్తోందని, తన సినిమాలకన్నా మంచి కమర్షియల్ విజయం ఈ చిత్రం సాధించడం ఆనందంగా వుందని వీరభద్రమ్ తెలిపారు. ఇంత పెద్ద విజయం అందించిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామని, ఇదే ఉత్సాహంతో వంద థియేటర్లు పెంచుతున్నామని, కామెడీ, డ్రామా ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చిందని, తొలి మూడు రోజుల్లోనే వసూలు పరంగా సేఫ్ జోన్‌లోకి వచ్చామని నిర్మాతలు తెలిపారు. తాను చాలా స్టైల్‌గా ఈ చిత్రంలో కన్పించానని అందరూ చెబుతున్నారని, హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ప్రశంసలు లభిస్తున్నాయని, కుటుంబ సమేతంగా అందరూ చూడదగిన చిత్రమని కథానాయకుడు ఆది తెలిపారు. ప్రేమకావాలి, లవ్‌లీ చిత్రాల తరువాత ఆదికి చుట్టాలబ్బాయి రూపంలో బిగ్గెస్ట్ హిట్ లభించిందని, నిర్మాతలు చక్కని సినిమాపై వున్న ప్యాషన్‌ను ఈ చిత్రం ద్వారా నిరూపించుకున్నారని, ఈసారి ఆది-సాయికుమార్ పూర్తి స్థాయి మల్టీస్టారర్ చిత్రంలో నటించాలని నిర్మాత బి.ఎ.రాజు కోరుకున్నారు. కార్యక్రమంలో కథానాయిక నమితా ప్రమోద్, ప్రదీప్ తదితరులు చిత్ర విశేషాలను తెలిపారు.