గరమ్ గరమ్ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆది, ఆదాశర్మ జంటగా శ్రీనివాసాయి స్క్రీన్స్ పతాకంపై మదన్ దర్శకత్వంలో టి.సురేఖ రూపొందించిన ‘గరం’ చిత్రానికి సంబంధించిన పాటలు ఇటీవల విడుదలయ్యాయి. గోపీచంద్, రకుల్‌ప్రీత్‌సింగ్ బిగ్ సీడీని, ఆడియో సీడీని విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మదన్ మాట్లాడుతూ శ్రీనివాస్ చెప్పిన కథా కథనాలు నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చానని, లేటు అయినా సినిమా అందరికీ నచ్చే విధంగా రూపొందిందని తెలిపారు. సంగీత దర్శకుడు అగస్త్యతో వున్న మంచి అనుబంధంతో ఈ చిత్రానికి మంచి ట్యూన్లను రాబట్టుకున్నానని, అతను కొత్తగా చాలా వేగంగా చేసే నేర్పు ఉన్నాడని, ఈ సినిమాకోసం ఫుల్ మసాలా మాస్ పాటలు ఇచ్చాడని తెలిపారు. సినిమా విడుదలయ్యాక పాటలతోపాటు అన్నీ నచ్చుతాయని తెలిపారు. ఎమోషనల్ ఎలిమెంట్‌తో కమర్షియల్ ఎలిమెంట్‌ను మిక్స్‌చేసి ఈ చిత్రాన్ని రూపొందించారని, సంగీత దర్శకుడు మంచి పాటలతోపాటు రీరికార్డింగ్ అద్భుతంగా చేశారని, కథానాయకుడు ఆది తెలిపారు. మదన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తమ సంస్థలో రూపొందించిన లవ్‌లీ లాంటి సూపర్‌హిట్ తర్వాత ఈ చిత్రం కూడా అంత విజయం సాధిస్తుందని నిర్మాత బి.ఎ.రాజు తెలిపారు. కార్యక్రమంలో సాయికుమార్, కెకె రాధామోహన్, గోపీచంద్, దగ్గుబాటి రానా, వీరభద్రం, రాజ్‌తరుణ్, సందీప్‌కిషన్, రామ్‌తలారి, థ్రిల్లర్ మంజు, రవికుమార్, సుబ్బారెడ్డి, భాస్కరభట్ల, సుశాంత్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి కథ, మాటలు: శ్రీనివాస్ గవిరెడ్డి, పాటలు: భాస్కరభట్ల, శ్రీమణి, పులగం చిన్నారాయణ, కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, సంగీతం: అగస్త్య, నిర్మాత: పి.సురేఖ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మదన్.