అందరికీ నచ్చే సిద్ధార్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాగర్, రాగిణి నంద్వాని, సాక్షీ చౌదరి హీరో హీరోయిన్లుగా కె.వి.ద యానందరెడ్డి దర్శకత్వంలో రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్‌కుమార్ నిర్మిస్తున్న ‘సిద్ధార్థ’ చిత్ర ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో సాగర్ మాట్లాడుతూ, అన్ని రకాల హంగులతో తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం సాధిస్తుందని అన్నారు. పరుచూరి గోపాలకృష్ణ మాట్లాడుతూ, ఈ సినిమాతో సాగర్‌కు అటు మాస్, ఇటు క్లాస్ ఆడియన్స్‌లో మంచి ఆదరణ లభిస్తుందని, కథలో ప్రేమ, పగ సెంటిమెంట్ అన్ని రకాల అంశాలున్నాయని అన్నారు. నిర్మాత కిరణ్‌కుమార్ మాట్లాడుతూ, సెప్టెంబర్ 2న పాటలను విడుదల చేస్తామని అన్నారు. దర్శకుడు దయానంద్ మాట్లాడుతూ, ఈ సినిమా సక్సెస్‌తో మా నిర్మాత మరింత పెద్ద నిర్మాతగా ఎదగాలని, ఈ సినిమాకు మణిశర్మ అందించిన సంగీతం హైలెట్‌గా నిలుస్తుందని అన్నారు. అలాగే ఎస్.గోపాల్‌రెడ్డి ఫొటోగ్రఫి మరో హైలెట్. అందరికీ నచ్చే అంశాలతో వస్తున్న ఈ సిద్ధార్థను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నానన్నారు.