చిరుతో తమన్నా ఐటం సాంగ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిరంజీవి రీ ఎంట్రీ ఇస్తూ నటిస్తున్న 150వ సినిమా ‘ఖైదీ నెంబర్ 150’ జోరుగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. వినాయక్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో గ్లామర్ భామ కాజల్ హీరోయిన్‌గా నటిస్తోంది. రామ్‌చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ఇప్పుడు మరో ప్రత్యేకత సంతరించుకోనుంది. మిల్కీ భామ తమన్నా ఓ స్పెషల్ సాంగ్ చేస్తూండటం విశేషం. ఇప్పటికే ఆ దిశగా వినాయక్ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. ఇదివరకే వినాయక్ తమన్నాతో ‘అల్లుడు శీను’ సినిమాలో ఐటెం సాంగ్ చేయించాడు. కాబట్టి ఈ సినిమాలో మెగాస్టార్‌తో కలిసి తమన్నా ఈ సాంగ్ చేస్తే సినిమాకు ఇంకాస్త ప్లస్ అవుతుందని భావిస్తున్నారట. ఇదివరకే తమన్నా కూడా మెగాస్టార్‌తో కలిసి డాన్స్ చేయాలనే కోరిక వుందని తెలిపింది. సో.. తమన్నా కోరిక తీరే సమయం వచ్చేసిందన్నమాట. తమిళ ‘కత్తి’ చిత్రానికి రీమేక్‌గా రూపొందిస్తున్న ఈ సినిమా జనవరిలో విడుదల చేస్తారట!