అందరికీ నచ్చే అపార్ట్‌మెంట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ క్రియేటివ్ ఫిలింస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో నిఖిత, సంజన, చిన్న, ఉత్తేజ్ ప్రధాన తారాగణంగా శివగంగరాజు వుడిముడి దర్శకత్వంలో ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ రూపొందించిన చిత్రం ‘అపార్ట్‌మెంట్’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ముగించారు. సినిమాలోని పాటల సీడీని ఆర్.పి.పట్నాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంగీత దర్శకుడు ఖుద్దూస్ మంచి బాణీలు అందివ్వగల సత్తా వున్నవాడని, అతనినుండి మంచి పాటలు వస్తాయని తాను ఆశిస్తున్నట్లు తెలిపారు. ఒక అపార్ట్‌మెంట్ సంస్కృతిలోకి వచ్చిన ఓ అమ్మాయి అక్కడ ఎలాంటి అనుభవాలను ఎదుర్కొన్నది అన్న కథనంతో ఈ చిత్రం సాగుతుందని, సంగీత దర్శకుడు మంచి బాణీలతోపాటు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారని, తప్పక అందరికి నచ్చుతుందని దర్శకుడు శివగంగరాజు వుడిముడి తెలిపారు. దర్శకుడు తొలి చిత్రమే అయినా చక్కగా తెరకెక్కించారని, ఖుద్దూస్ సంగీతం సినిమాకు హైలెట్‌గా నిలుస్తుందని, అలాగే నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం శ్రమించారని, తప్పక అందరికీ నచ్చుతుందన్న నమ్మకం వుందని నిర్మాత శ్రీకాంత్ అంగళ్ళ అన్నారు. కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఖుద్దూస్, నికిత తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు. విజయ్‌సాయి, రక్ష, సుభాషిణి, ప్రియాంక తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:సాబూ జేమ్స్, ఎడిటింగ్:నాగిరెడ్డి, సంగీతం:ఖుద్దూస్.ఎస్.ఎ, నిర్మాత:ఎ.కె.శ్రీకాంత్ అంగళ్ళ, కథ, దర్శకత్వం:శివగంగరాజు వుడిముడి.