శాతకర్ణి రాజసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలకృష్ణ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చారిత్రాత్మక చిత్రం ‘గౌతమీపుత్ర శాతకర్ణి’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో జరుగుతోంది. రెండవ శతాబ్దానికి చెందిన రాజులలో గౌతమీపుత్ర శాతకర్ణి అగ్రగణ్యుడు. ఆయన జీవిత కథను ఆధారంగా ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందిస్తున్న ఈ చిత్రం షూటింగ్ మధ్యప్రదేశ్‌లో శరవేగంగా సాగుతోంది. అక్కడి సన్నివేశాలకు సంబంధించిన కొన్ని ఫొటోలు సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తున్నాయి. బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా దర్బారుకు వేంచేస్తున్నట్లుగా ఓ ఫోటో, రాజమాతగా హేమమాలిని, గౌతమీపుత్ర శాతకర్ణి రాణిగా శ్రీయ ఈ ఫొటోల్లో కన్పిస్తున్నారు. ఆమె చేతుల్లో ఓ చిన్నారికూడా ఉండటం విశేషం. ఈ ఫోటోలో కన్పిస్తున్న దృశ్యం రాజదర్పం ఉట్టిపడేలా ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసి ఈ చిత్రాన్ని జనవరిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.