ఏప్రిల్‌లో మహేష్ కొత్త సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రముఖ నటుడు మహేష్‌బాబు హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం జోరుగా షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే 30శాతంపైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రానికి ప్రముఖ తమిళ దర్శకుడు మురగదాస్ దర్శకత్వం వహిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఓ సామాజిక కథాంశం నేపథ్యంలో రూపొందుతోంది. ఈనెలనుండి చెన్నైలో షూటింగ్ జరగనుంది. డిసెంబర్ వరకు షూటింగ్ పూర్తిచేసి ఆ తరువాత మిగతా కార్యక్రమాలన్నీ పూర్తిచేసి ఏప్రిల్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఎన్.వి.ప్రసాద్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతోంది. రకుల్‌ప్రీత్‌సింగ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తరువాత మహేష్ కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తాడని తెలిసింది.