నమ్మశక్యం కాని వీరప్పన్ .... అమితాబ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తమిళనాడు, కర్నాటక, కేరళ రాష్ట్రాలను గడగడ లాడించిన గంధపుచెక్కల స్మగ్లర్ వీరప్పన్‌పై రామ్‌గోపాల్‌వర్మ రూపొందించిన చిత్రం ‘కిల్లింగ్ వీరప్పన్’. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమా ట్రైలర్‌ను చూసిన బాలీవుడ్ స్టార్ అమితాబ్‌బచ్చన్ ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ నమ్మశక్యం కాని విధంగా వుందని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. అమితాబ్ ఓ తెలుగు సినిమా గురించి ఇలా వ్యాఖ్యానించడం ఇదే మొదటిసారి. దీని గురించి రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడుతూ నిజమైన కథలను తీయడంలో తాను దిట్టఅని నమ్మే వ్యక్తులలో అమితాబ్‌బచ్చన్ ఒకరని, తనకు తెలిసి ఆయనకు సినిమాలో వున్న అసాధారణమైన ఊహాచిత్రాలు, ఫిలిమ్ ఇంటెన్సిటీ బాగా నచ్చినట్లుగా అర్ధమవుతోందని అన్నారు. శివరాజ్‌కుమార్, సందీప్ భరద్వాజ్, యజ్ఞాశెట్టి, పరుల్‌యాదవ్, రాక్‌లైన్ వెంకటేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: రమ్మి, సంగీతం: రవిశంకర్, ఎడిటింగ్: అన్వర్ అలీ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రామ్‌గోపాల్‌వర్మ.