తాతను మించిన మనవడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెండితెర వేల్పుగా తెలుగు ప్రేక్షకుల మనసుదోచిన ఎన్టీఆర్‌కు సాటి మరొకరు లేరన్నది అందరి మాట. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ మాటకూడా అదే అయినా తనదైన శైలిలో స్పందిస్తూ జూనియర్ ఎన్టీఆర్‌ను ప్రశంసిస్తూ చేసిన వ్యాఖ్య ఇప్పుడు అందరినీ ఆకర్షిస్తోంది. అలనాటి మేటి నటుడు ఎన్టీఆర్‌ను మించిపోయేలా మనవడు జూనియర్ ఎన్టీఆర్ పరిణతి చెందుతున్నాడని వర్మ చేసిన ట్వీట్ ఇప్పుడు హల్‌చల్ చేస్తోంది.
నిజానికి ఎన్టీఆర్‌ను ప్రేక్షకులు అమితంగా ఆరాధించారు. అద్భుత నటనాకౌశలంతో ఆయన ఆ అభిమానాన్ని సంపాదించారు. అందుకే ఎన్టీఆర్‌కు సరైన పోటీ లేదు అని తెలుగువారందరూ ముక్తకంఠంతో ఒప్పుకుంటారు. కానీ సంచలనాలే వేదికగా వ్యాఖ్యానాలు చేసే రామ్‌గోపాల్‌వర్మ మాత్రం ఎన్టీఆర్ కన్నా జూనియర్ ఎన్టీఆర్ చాలా గొప్పనటుడని కితాబు ఇచ్చారు. అలనాటి ఎన్టీఆర్‌తో సమానమైన ప్రతిభ, అదృష్టం, నిరంతర పరిశ్రమ ఇప్పటి తరానికి లేకపోయినా, కొద్దిలో కొద్దిగా జూ.ఎన్టీఆర్ తాతను గుర్తుచేసేలా నటించి పేరు తెచ్చుకున్నారు. అయితే ఇందులో ఒక వర్గం మాత్రం జూ.ఎన్టీఆర్‌కు ఎటువంటి కీర్తి రాకుండా జాగ్రత్తలు పడుతూనే వున్నారని టాలీవుడ్‌లో వినబడుతున్న సమాచారం.
కానీ రామ్‌గోపాల్‌వర్మ మాత్రం జనతాగ్యారేజ్ చిత్రం చూశాక ‘జూనియర్ రోజురోజుకీ నటనలో మెరుగవుతున్నాడు.
ఓ రకంగా అతనిలో మార్పుకి నాన్నకు ప్రేమతో సినిమాతో మొదలైందనుకుంటా. దర్శకుడు సుకుమారే ఎన్టీఆర్‌లో వున్న సరికొత్త కోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశాడు.
అయితే అలనాటి ఎన్టీఆర్ మాస్ పల్స్ పట్టుకొని చిత్రాలను రూపొందిస్తే, ఈ జూనియర్ క్లాస్, మాస్‌ని కూడా మెప్పిస్తున్నాడు’ అని పొగిడేశారు. ఇప్పుడే తాను జనతా గ్యారేజ్ సినిమా చూశానని, సినిమా అదిరిపోయిందని, రామ్‌గోపాల్‌వర్మ ట్వీట్ చేయడంపై టాలీవుడ్‌లో ఇప్పుడు చర్చ జరుగుతోంది. అయితే వర్మ ఎవరినీ అంత సులువుగా పొగడడు. అయితే ఇద్దరు ఎన్టీఆర్‌ల మధ్య ఉన్న బేధాన్ని మాత్రం చక్కగా అరటిపండు ఒలిచి పెట్టినట్లుగా చెప్పాడు.