కోలీవుడ్‌లోకి అఖిల్ హీరోయిన్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్కినేని అఖిల్ హీరోగా ఎంట్రీ ఇచ్చిన ‘అఖిల్’ సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా పరిచయం అయింది బాలీవుడ్ భామ సాయేషాసైగల్. బాలీవుడ్లో ది గ్రేట్ యాక్టర్ దిలీప్‌కుమార్ మనవరాలైన ఈమెకు పాపం మొదటి సినిమా పెద్ద నిరాశనే మిగిల్చింది. ఆ సినిమా తరువాత ఈ భామకు తెలుగులో ఒక్క అవకాశంకూడా రాలేదు. దాంతో అటు బాలీవుడ్లోకూడా గట్టి ప్రయత్నాలే చేసి ఓ సినిమా పట్టేసింది. అజయ్‌దేవగన్ హీరోగా నటిస్తున్న ‘శివాయ్’ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్న ఈ భామ ఇప్పుడు మళ్లీ సౌత్‌లో ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఈసారి తెలుగులోకాదు కోలీవుడ్‌పై కనే్నసింది. సౌత్‌లో హీరోయిన్‌గా చేస్తే ఆ క్రేజ్ వేరేలా ఉంటుందని ఫిక్స్‌అయినట్టుంది. అందుకే కాస్త గట్టిగానే ప్రయత్నాలుచేస్తున్న ఈమెకు జయం రవి హీరోగా నటిస్తున్న ఓ సినిమాలో ఛాన్స్ దక్కింది. ఇప్పటికే ఆ దిశగా ఆమెతో చర్చలు కూడా జరుగుతున్నట్టు సమాచారం. మరి ఈ సినిమాతో అయినా సాయేషాకు కలిసి వస్తుందో లేదో చూడాలి!

చిత్రం..సాయేషాసైగల్