నేనింకా జీరో దగ్గరే ఉన్నా.. నాగశౌర్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అబ్బాయితో అమ్మాయి’ చిత్రం ఈ జనరేషన్ ప్రేమకథలా వుంటుంది. ప్రేమకథలు చెప్పడంవల్ల ఇప్పటి తరం వారంతా తమను తాము ఆయా పాత్రల్లో చూసుకొని, కనెక్ట్ అవుతారు అని చెబుతున్నాడు యువ హీరో నాగశౌర్య. ‘ఊహలు గుసగుసలాడే’,‘దిక్కులు చూడకు రామయ్య’ చిత్రాల ద్వారా లవర్ బాయ్‌లా తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన నాగశౌర్య తాజాగా నటించిన చిత్రం ‘అబ్బాయితో అమ్మాయి’. రమేష్‌వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా హీరో నాగశౌర్య చెప్పిన విశేషాలు...ఆయన మాటల్లోనే..
మళ్లీ క్లాస్ సినిమా
‘జాదూగాడు’ ఫలితాలు చూశాం కదా. ప్రేమకథల్లో ఇన్నోసెన్స్ నా స్టయిల్‌కు సరిగ్గా సరిపోతుంది. దానికి బి,సి సెంటర్లన్న తేడా కూడా ఉండదు. ఆ నమ్మకంతోనే వరుసగా నా నాలుగు సినిమాలను ప్రేమకథలతోనే సిద్ధం చేశా. 1న విడుదలవుతున్న ‘అబ్బాయితో అమ్మాయి’, ‘కళ్యాణ వైభోగమే’, ‘జో అచ్చుతానంద’, ‘ఒక్క మనసు’ ఇలా అన్ని ప్రేమకథా చిత్రాల్లోనే నటిస్తున్నా.
అబ్బాయితో అమ్మాయి
ఈ సినిమా ఈ జనరేషన్ ప్రేమకథలా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. నేటి యువత ఫేస్‌బుక్ ప్రేమలో ఎలా పడిపోతున్నారు? అందులో ఉన్న మంచి చెడులు ఎంత? అన్న అంశాలను చర్చించే చిత్రమిది. చూడడానికి అర్బన్ నేపధ్యంలో ఉన్నా అందరికీ కనెక్ట్ అయ్యే కథ ఇది. ముందే చెప్పినట్టుగా ఈ జనరేషన్ ప్రేమికులు తమను తాము ఆయా పాత్రల్లో చూసుకుంటారు. అదే ఈ చిత్రానికి హైలెట్.
ఇళయరాజా సంగీతం కూడా మరో హైలెట్‌లా నిలుస్తుంది. దర్శకుడు రమేష్‌వర్మ చిత్ర కథాకథనాలపై మంచి పట్టున్న వ్యక్తి. అనుకున్నది అనుకున్నట్లుగా పక్కాగా తెరపై ఆవిష్కరించాడు.
ఆ నాలుగు సినిమాలతో...
రెండు మూడు చిత్రాల్లో హీరోగా నటించి, సక్సెస్ అయినా నేనింకా జీరోదగ్గరే ఉన్నా. 2016లో నాలుగు చిత్రాలు విడుదలవుతాయి. వాటితో ఓ మెట్టు ఎక్కుతానని అనుకుంటున్నా. ఈ నాలుగు చిత్రాలు ప్రేమకథలే అయినా దేనికదే డిఫరెంట్ కానె్సప్ట్‌తో ప్రేక్షకులను అలరిస్తాయి. వచ్చే కొత్త సంవత్సరం నా కెరీర్‌లో ఓ స్పెషల్!
తదుపరి చిత్రాలు
‘కళ్యాణ వైభోగమే’ చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. ఇక ఒక్క మనసు నేనెప్పటికీ గుర్తుంచుకునే ఓ అందమైన ప్రేమకథ. ‘జో అచ్చుతానంద’ ఫిబ్రవరిలో సెట్స్‌పైకి వెళ్లనుంది. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు.

- శ్రీ