సంక్రాంతికి ఖైదీ 150 విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తోన్న 150వ సినిమా ‘ఖైదీ నెం.150. ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి పుట్టినరోజును పురస్కరించుకొని గత నెల్లో విడుదలైన ఫస్ట్‌లుక్‌తో సినిమాపై ఉన్న అంచనాలన్నీ తారాస్థాయికి చేరిపోయాయి. ఇక ఇప్పటికే సగభాగం పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా విడుదలవుతుందని టీమ్ ఎప్పుడో ప్రకటించగా, తాజాగా ఇదే విషయాన్ని దర్శకుడు వి.వి.వినాయక్ మరోసారి స్పష్టం చేశారు. రాజమండ్రిలోని విద్యాగణపతి ఆలయాన్ని సందర్శించిన వినాయక్, ఆ తర్వాత అక్కడి మీడియా మాట్లాడుతూ, చిరంజీవి 150వ సినిమా తాము అనుకున్నట్లుగానే చాలా బాగా వస్తోందని, సంక్రాంతి కానుకగా జనవరి 13న సినిమా విడుదలవుతుందని తెలిపారు. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘కత్తి’కి రీమేక్‌గా తెరకెక్కుతున్న ‘ఖైదీ నెం.150’ని లైకా ప్రొడక్షన్స్‌తో కలిపి రామ్‌చరణ్ స్వయంగా నిర్మిస్తున్నారు. చిరు సరసన కాజల్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నారు.