చైతుతో నినే్న పెళ్లాడతా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నినే్న పెళ్ళాడతా’ అంటూ నాగచైతన్య వెంట పడబోయే హీరోయిన్ ఎవరో తెలిసిపోయింది. సమంత, తమన్నాలాంటి ముద్దుగుమ్మల పేర్లు వినిపించినా చివరికి ఆ ప్లేస్‌లో రకుల్ ఖాయమైంది. సోగ్గాడే చిన్నినాయనా ఫేమ్ కళ్యాణ్‌కృష్ణ దర్శకత్వంలో నాగచైతన్య ఓ చిత్రం చేయబోతున్న సంగతి తెలిసిందే. నాగ్ నటించిన ‘నినే్న పెళ్లాడతా’ తరహా స్క్రిప్టుని కళ్యాణ్ సిద్ధం చేశారట. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమాకి కూడా నినే్నపెళ్లాడతా అనే పేరే ఫిక్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇందులో చైతూ సరసన నటించబోయే కథానాయికగా పలువురు పేర్లు వినిపించాయి. కానీ చివరి నిమిషంలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ని ఖాయం చేశారు. సమంత దగ్గర బోలెడన్ని కాల్షీట్లు ఉన్నప్పటికీ ఆమెని చిత్ర బృందం పరిగణనలోకి తీసుకోలేదు. చైతూ, సమంతలు ఏ క్షణంలోనైనా పెళ్ళిపీటలెక్కే పరిస్థితి ఉండటమే అందుకు కారణం అని చెప్పొచ్చు. ఎట్టకేలకు ఫుల్‌ఫామ్‌లో ఉన్న రకుల్‌కి ఆ ఆఫర్ దక్కింది. ఈనెలలోనో చైతూ, రకుల్‌ల సినిమాకి కొబ్బరికాయ కొట్టబోతున్నారు.