23న వస్తున్న మజ్ను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాని, ఇమాన్యుయేల్, ప్రియాశ్రీ ముఖ్యపాత్రల్లో విరించి వర్మ దర్శకత్వంలో ఆనంది ఆర్ట్స్ క్రియేషన్స్, కేవా మూవీస్ పతాకాలపై పి.కిరణ్, గోళ్ళ గీత నిర్మిస్తున్న చిత్రం ‘మజ్ను’. ఇటీవలే పాటలు విడుదలైన ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు వివరాలు తెలియజేస్తూ, ‘ఇటీవలే విడుదలైన ఆడియోకు మంచి స్పందన లభించింది. గోపీసుందర్ సంగీతం అందించిన పాటలన్నీ సూపర్‌హిట్‌గా నిలిచాయి. ముఖ్యంగా ట్రైలర్స్‌కు బ్రహ్మాండమైన రెస్పాన్స్ వస్తోంది. నాని కెరీర్‌లో మరో భిన్నమైన సినిమా మజ్ను. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసి మిగతా కార్యక్రమాలన్నీ పూర్తికావచ్చాయి. ఈనెల 23న భారీగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం’ అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ- భిన్నమైన కథతో తెరకెక్కిన ఈ చిత్రం, ఆడియో హిట్ అయినట్టే సినిమా కూడా ఘనవిజయం సాధిస్తుందని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:గోపీసుందర్, కెమెరా: జ్ఞానశేఖర్.వి.ఎస్., ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, నిర్మాతలు:పి.కిరణ్, జి.గీత, దర్శకత్వం:విరించి వర్మ.