వానవిల్లు ట్రైలర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతీక్, శ్రావ్య, విశాఖ ప్రధాన తారాగణంగా రాహుల్ ప్రేమ్ మూవీ మేకర్స్ పతాకంపై ప్రతీక్ ప్రేమకరణ్ దర్శకత్వంలో లంకా కరుణాకర్‌దాస్ రూపొందిస్తున్న చిత్రం ‘వానవిల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్‌లో శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ, ఈ సినిమాపై తమ యూనిట్ మంచి కాన్ఫిడెన్స్‌తో వుందని, త్వరలో విడుదల చేస్తామని తెలిపారు. కథ బాగుండడంతో నటీనటులంతా సహకరించి సినిమా పూర్తవడానికి సహకారం అందించారని అన్నారు. కేరళ, మలేసియా, అరకు, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో ఖర్చుకు వెనుకాడకుండా విజువల్ వండర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, ట్రైలర్‌తోపాటు సినిమా కూడా అందరికీ నచ్చుతుందని నిర్మాత లంకా కరుణాకర్‌దాస్ తెలిపారు. కార్యక్రమంలో హీరోయిన్ శ్రావ్య, కెమెరామెన్ ఎస్.డి.జాన్ చిత్ర విశేషాలను తెలిపారు. హేమ, ప్రభాస్ శ్రీను, సత్య, సురేఖావాణి, టిల్లు వేణు, జబర్దస్త్ ఫణి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:ప్రభుప్రవీణ్, మాటలు:పవన్, కెమెరా:ఎస్.డి.జాన్, కథ, స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్, దర్శకత్వం:ప్రతీక్ ప్రేమ్‌కరణ్.