‘మెంటల్’కి నేనే దర్శకుణ్ని

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీకాంత్ హీరోగా రూపొందిన ‘మెంటల్’ చిత్రంపై మరో వివాదం మొదలైంది. గతంలో పోలీస్ ఉ ద్యోగులు అభ్యంతరం చెప్పడంతో ‘మెంటల్ పోలీస్’ను ‘మెంటల్’గా మార్చారు. ఫస్ట్‌లుక్ టీజర్ విడుదల సమయంలో చిత్ర దర్శకుడు కరణం పి.బాబ్జి పేరు కనిపించినా, విడుదలయ్యాక మాత్రం ఎస్.కె.బషీద్‌ను దర్శకుడిగా పరిచయం చేశారు. బషీద్ పేరుతోనే సినిమా విడుదలైంది. ఈ విషయంపై స్పందించిన కరణం పి.బాబ్జి మాట్లాడుతూ, మెంటల్ చిత్రానికి తన పేరును తీసేసి బషీద్ పేరు అక్రమంగా వేశారని ఆరోపించారు. ఈ సినిమాకు తాను ఐదు లక్షలపైన పెట్టుబడి పెట్టి ఏడాదిన్నరపాటు సినిమాకోసం పనిచేశానని, ఈ విషయంపై హీరో శ్రీకాంత్‌కు ఫోన్ చేస్తే, అరగంటలో మార్పిస్తానని చెప్పి ఇంతవరకూ మార్పించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. దర్శకుడి పేరు మార్చకపోతే ఫిలిమ్ ఛాంబర్ ముందు దీక్ష చేస్తానని, అప్పటికీ స్పందించకపోతే బషీద్ ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని ఆయన తెలిపారు. ఈ విషయంపై స్పందించిన నిర్మాతల మండలి ప్రతినిధులు ‘పేరు మార్చే అధికారం నిర్మాతకు మాత్రమే వుంటుందని, సంబంధిత నిర్మాత ఫిర్యాదు చేస్తే చర్య తీసుకుంటామ’ని అన్నారు.