యథార్థ ఘటనలతో మనలో ఒకడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యూనిక్రాఫ్ట్స్ మూవీ పతాకంపై ఆర్.పి.పట్నాయక్ నటిస్తూ సంగీతం అందిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న చిత్రం ‘మనలో ఒకడు’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో ఇటీవల విడుదలైంది. అనితా.హెచ్.రెడ్డి కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విజయోత్సవ వేడుక తిరుపతిలో ఈ నెల 19న జరగనుంది. ఈ సందర్భంగా ఆర్.పి.మాట్లాడుతూ, షూటింగ్ పూర్తయిన ఈ చిత్రానికి సంబంధించిన డిటిఎస్ మిక్సింగ్ కార్యక్రమాలు జరుపుతున్నామని, కృష్ణమూర్తి అనే సామాన్య అధ్యాపకుడి కథనంతో సాగే ఈ చిత్రం యధార్థ ఘటనల ఆధారంగా రూపొందించామని తెలిపారు. ప్రస్తుత సమాజంలో మీడియా పవర్ ఏంటో అందరికీ తెలుసని, ఆ మీడియా నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందని, ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించిందని నిర్మాత జగన్మోహన్ తెలిపారు. ఈనెలాఖరుకు సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు జరుపుతున్నామని అన్నారు. సాయికుమార్, జెమిని సురేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా:ఎస్.జె.సిద్ధార్థ్, పాటలు:చైతన్యప్రసాద్, పులగం చిన్నారావు, వనమాలి, నిర్మాత: జగన్మోహన్, దర్శకత్వం:ఆర్.పి.పట్నాయక్.