నవీన్‌చంద్ర.. కోటీశ్వరుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతకంపై నవీన్ చంద్ర, శృతి సోది జంటగా ఇ.సత్తిబాబు దర్శకత్వంలో కె.కె.రాధామోహన్ రూపొందిస్తున్న తాజా చిత్రానికి ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ అన్న పేరును ఖరారు చేశారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ, రెండు పాటలు మినహా సినిమా షూటింగ్ పూర్తయిందని, ఒక పాటను ఈనెలలోనే అరకులో చిత్రీకరించడానికి సన్నాహాలు జరుపుతున్నామన్నారు. వందశాతం ప్రేక్షకులకు హిలేరియస్ కామెడీని అందించే ఈ చిత్రం సూపర్‌హిట్ అవుతుందని తెలిపారు. ప్రేక్షకుల కోరుకునే వినోదం వున్న ఈ సినిమా బాగా వస్తోందని, ఓ మంచి చిత్రానికి దర్శకత్వం వహిస్తుండడం సంతోషంగా వుందని దర్శకుడు ఇ.సత్తిబాబు తెలిపారు. పృధ్వీ, సలోని, జయప్రకాష్‌రెడ్డి, పోసాని కృష్ణమురళి, మురళీశర్మ, రఘుబాబు, ప్రభాస్ శ్రీను, చలపతిరావు, ధన్‌రాజ్, పిల్లాప్రసాద్, గిరి, సన, విద్యుల్లేఖారామన్, మీనా, నేహాంత్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:శ్రీవసంత్, కెమెరా:బాల్‌రెడ్డి, కథ, మాటలు:నాగేంద్రకుమార్, పాటలు:రామజోగయ్యశాస్ర్తీ, భాస్కరభట్ల, నిర్మాత:కె.కె.రాధామోహన్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:ఇ.సత్తిబాబు.