1న చిత్రం భళారే విచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాందిని ప్రధాన పాత్రలో భానుప్రకాష్ బులుసు దర్శకత్వంలో పి.ఉమాకాంత్ రూపొందించిన చిత్రం ‘చిత్రం భళారే విచిత్రం’. మనోజ్‌నందం, అనిల్‌కళ్యాణ్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం జనవరి 1న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు భానుప్రకాష్ మాట్లాడుతూ.. ఈ సినిమా కథ నిర్మాతకు చెప్పగానే ఎంతో ఉత్సాహంతో ముందుకు వచ్చారని, బెస్ట్‌ఔట్‌పుట్ ఇవ్వడానికి తాను ప్రయత్నించానని, కామెడీ థ్రిల్లర్‌గా రూపొందించిన ఈ చిత్రంలో కమర్షియల్ సినిమాకు కావలసిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయని, రెగ్యులర్ ఫార్మాట్‌కు భిన్నంగా వుంటుందని, సెన్సార్ సభ్యులనుండి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు. కామెడీ, సస్పెన్స్, ఎమోషన్ లాంటి అన్ని ఎమోషన్స్‌తో సాగుతూ క్లైమాక్స్‌లో ప్రతి ఒక్కరిచేత కంట తడిపెట్టించేలా దర్శకుడు చిత్రం రూపొందించారని, నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తిచేశామని, నూతన సంవత్సర కానుకగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో చాందిని తదితరులు చిత్ర విశేషాలు తెలిపారు. సౌమ్య, శుభశ్రీ, జీవా, సూర్యప్రకాశ్, ప్రభాస్‌శ్రీను, అల్లరి సుభాషిణి, వేణుగోపాలరావు, వాసు ఇంటూరి, రాము, కేక బాషా, శరత్‌బాబు పూడూరు, రుద్రప్రకాష్, రాకెట్ రాఘవ తదితరులు నటించిన ఈ చిత్రానికి: కెమెరా: టి.సురేందర్‌రెడ్డి, ఎడిటింగ్: గోపి సిందమ్, సంగీతం: కనకేష్ రాథోడ్, నిర్మాత: పి.ఉమాకాంత్, దర్శకత్వం: భానుప్రకాష్ బులుసు.