బన్నీ ద్విభాషా చిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల్లు అర్జున్ అటు తెలుగులోనూ ఇటు మలయాళంలోనూ మంచిపేరు తెచ్చుకున్నారు. ప్రస్తుతం ఆయన కథానాయకుడిగా తెలుగు, తమిళ భాషల్లో లింగుస్వామి దర్శకత్వంలో గ్రీన్ స్టూడియో ప్రొడక్షన్స్ పతాకంపై కె.ఇ.జ్ఞానవేల్‌రాజా ఓ కొత్త చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం చెన్నైలో జరిగింది. ప్రస్తుతం ‘దువ్వాడ జగన్నాధం’ షూటింగ్‌లో పాల్గొంటున్న అల్లు అర్జున్, తమిళంలోకి ఎంట్రీ ఈ చిత్రంతో ఇస్తున్నాడు. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ క్రేజీ ప్రాజెక్టు గురించి అల్లు అర్జున్ మాట్లాడుతూ- తనకు చెన్నైతో ఎంతో అనుబంధం వుందని, తాను ఇక్కడే పుట్టి పెరిగానని, తమిళంలో డైరెక్టు చిత్రంలో నటించడానికి ఎంతో ఆలోచించానని అన్నారు. ఈ సందర్భంగా తనను తమిళ ప్రేక్షకులకు పరిచయం చేస్తున్న దర్శక నిర్మాతలకు ధన్యవాదాలన్నారు. చాలారోజులుగా ఈ సినిమా తాను నిర్మించాలనుకుంటున్నామని, ఫిబ్రవరి ద్వితీయార్థంలో లేదా మార్చి ప్రథమార్థంలో షూటింగ్ ప్రారంభం కానుందని, మిగతా వివరాలు త్వరలో తెలియజేస్తానని నిర్మాత జ్ఞానవేల్‌రాజా అన్నారు. తాను ఇప్పటివరకూ చూసిన హీరోలలో ఎనర్జిటిక్, హార్డ్ వర్కింగ్ లాంటి మంచి గుణాలు అర్జున్‌లో కనిపించాయని, అందుకే ఓ మంచి కథతో తమిళంలో ఈ సినిమా చేస్తున్నామని దర్శకుడు లింగస్వామి అన్నారు.