ఆ ఇద్దరూ నాకు దేవుళ్లు.. హీరో ఎన్.టి.ఆర్.

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నా 25వ చిత్రం ‘నాన్నకు ప్రేమతో..’లో నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన మా నాన్నకు ఈ చిత్రాన్ని నీరాజనంగా ఇస్తున్నా. నేను ఇన్ని సినిమాలు చేయడానికి కారణమైన దేవుళ్లు తాత, నాన్న. వారు మమ్మల్ని నిరంతరం పోరాడమని చెప్పారు. నాన్నకుప్రేమతో చిత్రానికి సంబంధించిన కథ పుట్టిందే దర్శకుడు సుకుమార్ తండ్రివల్ల. ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కనపడడు. సుకుమార్ తండ్రి మాత్రమే కనిపిస్తాడు’ అని నటుడు ఎన్టీఆర్ తెలిపారు.
సుకుమార్ దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్.ఎల్.పి. పతాకంపై బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ రూపొందిస్తున్న చిత్రం ‘నాన్నకు ప్రేమతో’ ఆడియో వేడుకలో హీరో ఎన్టీఆర్ పై విధంగా అన్నారు. పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమంలో నటుడు కళ్యాణ్‌రామ్, ఎన్టీఆర్ తొలి సీడీని విడుదల చేసి నందమూరి హరికృష్ణకు అందించారు. ఈ సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ తారక్‌రామ్‌కు తానే పేరుపెట్టినా తన ఇద్దరి కొడుకులకూ ఎన్టీఆరే పేరుపెట్టారని తెలిపారు. ఈ ప్రపంచంలో పిల్లల విజయాన్ని తమ విజయంగా భావించి, నిస్వార్థంగా ప్రేమించేది తల్లిదండ్రులు మాత్రమేనని, ఈ పేరులో హార్ట్ బీట్ టచ్ కనబడుతుందని దర్శకుడు సుకుమార్ తెలిపారు. తండ్రితో ఉన్న ఎమోషన్‌ను ఈ సినిమాలో క్యారీ చేయడానికి తాను ప్రయత్నించానని ఆయన అన్నారు. కార్యక్రమంలో కళ్యాణ్‌రామ్, దేవిశ్రీప్రసాద్, వి.వి.వినాయక్, జగపతిబాబు, సుభాషి సర్కార్, కొరటాల శివ, చంద్రబోస్, రకుల్‌ప్రీత్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు. జగపతిబాబు, రాజేంద్రప్రసాద్, రాజీవ్‌కనకాల, అవసరాల శ్రీనివాస్, సితార, అమిత్, తా.రమేష్, గిరి, నవీన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: విజయ్‌చక్రవర్తి, ఫైట్స్: పీటర్ హెయిన్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, పాటలు: చంద్రబోస్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుకుమార్.