నేను..శైలజ కొత్తగా కన్పిస్తాం.. హీరో రామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రెగ్యులర్ కమర్షియల్ ఫార్మెట్‌లో కాకుండా టైటిల్‌నుండి ప్రతి విషయంలోనూ కొత్తదనాన్ని ప్రదర్శించామని అంటున్నాడు యువ హీరో రామ్. ఎనర్జిటిక్ హీరోగా తెలుగు తెరపై తనదైన ప్రత్యేక స్థానాన్ని సృష్టించుకున్నాడు రామ్. ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం ‘నేను.. శైలజ’. కిశోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి మూవీస్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 1న విడుదలవుతున్న సందర్భంగా హీరో రామ్‌తో ఇంటర్వ్యూ...
హరికథ టైటిల్ మార్చడానికి కారణం?
నిజానికి హరికథ అని ప్రచారం పొందిన ఈ టైటిల్ హరిగాడి కథ అని అనుకున్నాం. అయితే, టైటిల్ బాగాలేదనిపించి ‘నేను.. శైలజ’ అని పెట్టాం. సినిమా హరి అనే ఓ యువకుడి కథ.
గెటప్‌లో కొత్తగా కన్పిస్తున్నారు?
ఈ సినిమాకోసం అన్ని రకాలుగా కొత్తదనాన్ని ప్రయత్నించాం. టైటిల్‌నుండి కథ వరకూ ప్రతిదీ కొత్తగానే కనిపిస్తుంది. చాలారోజుల తరువాత నేను చేస్తున్న డిఫరెంట్ సినిమా ఇది. చాలా రియలిస్టిక్‌గా వుంటూ నటన కూడా అలాగే కొత్తగా అన్పిస్తుంది.
ఇంతకూ కథ ఏమిటి?
కథ గురించి చెప్పాలంటే పక్కా లవ్‌స్టోరీ. రియల్ లైఫ్ సంఘటనలనుంచి తీసుకున్న అంశాలతో రూపొందించాం. తండ్రీ కూతుళ్ళమధ్య సాగే కథలోకి హరి అనే యువకుడు ఎంటరైతే ఏం జరిగింది అనే ఆసక్తికర అంశాలతో సాగుతుంది. ఇందులో నేను లవ్ ఫెయిలైన యువకుడిగా కన్పిస్తాను. అందుకే గెడ్డం కూడా బాగా పెంచాల్సి వచ్చింది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ లవ్‌లో నో చెబితే హీరో వెంటపడి ఒప్పిస్తాడు. కానీ ఇందులో అలా వుండదు.
ఈ చిత్రంలో మీ పాత్ర గురించి?
ఇందులో నేను డిస్క్ జాకీగా పనిచేస్తుంటాను. ఇదివరకటి సినిమాలకు కాస్త భిన్నంగా కన్పిస్తాను.
దర్శకుడి గురించి?
కిశోర్ కథ చెప్పిన విధానం బాగా నచ్చింది. అంతకంటేమించి దాన్ని తెరకెక్కించే విధానం ఇంకా బాగుందని చెప్పాలి. ప్రతి విషయంపట్ల సరైన అవగాహన వున్న వ్యక్తి. సినిమాకు కావాల్సిన అంశాల్ని సెట్‌లో కూడా సరిచేయగల టాలెంట్ వుంది. ఖచ్చితంగా భవిష్యత్తులో పెద్ద దర్శకుడు అవుతాడు.
హీరోయిన్, మిగతా పాత్రల గురించి?
ఈ చిత్రంలో అచ్చతెలుగు అమ్మాయి కావాలని కీర్తిసురేష్‌ను ఎంపిక చేశాం. తను కూడా బాగా చేసింది. అలాగే, మరో ముఖ్యపాత్రలో సత్యరాజ్ కన్పిస్తారు. ఆయనతో నటించడం ఎగ్జైటింగ్‌గా వుంది.
ఆడియో రెస్పాన్స్ ఎలావుంది?
ఆడియోకు మంచి స్పందన వస్తోంది. దేవి అందించిన మ్యూజిక్ హిట్ అవ్వడంతో సినిమాపై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే, ఈ సినిమాలో ఫొటోగ్రఫి కూడా హైలెట్‌గా నిలుస్తుంది.
హిట్ ఫ్లాప్‌లను ఎలా రిసీవ్ చేసుకుంటారు?
హిట్ వస్తే ఎవరికైనా ఆనందమే. ఫ్లాప్ వస్తే మాత్రం రెండు మూడు రోజులు మూడీగా వుంటుంది. ఆ తరువాత అవన్నీ మర్చిపోయి మళ్లీ నెక్స్ట్ ప్రాజెక్టుపై దృష్టిపెట్టడమే. ఏదైనా హిట్ ఫ్లాప్‌లు మన చేతుల్లో లేవు.
ఈమధ్య సినిమాల్లో స్పీడ్ తగ్గించారు?
నాకు రోజూ షూటింగ్ చేయాలనే వుంటుంది. 24 గంటలైనా నేను రెడీనే. కానీ సినిమాలు కొన్ని అటూ ఇటూ అవ్వడంవల్ల ఆలస్యవౌతోంది.
మరి పెళ్ళెప్పుడు?
ప్రస్తుతానికి ఆ విషయం ఇంట్లోవాళ్ళు చూసుకుంటారు. మా ఇంట్లో నాకంటే పెద్దవారు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆ టెన్షన్ లేదు.
తదుపరి చిత్రాలు?
ప్రస్తుతానికి కథలైతే వింటున్నాను కానీ ఇంకా ఏదీ ఫైనల్ కాలేదు.

-శ్రీ