మా మెసేజ్ అందింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ప్రేక్షకులకు హైపర్ చిత్రం ద్వారా ఏం చెప్పాలనుకున్నామో ఆ మెసేజ్ అందిందనే భావిస్తున్నాం. ఎందుకంటే, విడుదలైన అన్ని కేంద్రాల్లో ఇదేవిధంగా రిపోర్ట్స్ వస్తున్నాయి. ఓ ఉద్యోగి తన సర్వీసులో ఎదుర్కొనే ఒడిదుడుకులను ఈ చిత్రంలో కమర్షియల్ మాస్ ఎంటర్‌టైనర్‌గా చెప్పాం’ అని నిర్మాతలు రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనీల్ సుంకర రూపొందించిన ‘హైపర్’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో ప్రభుత్వ ఉద్యోగుల బాధ్యత ఎంత వుంది సమాజంపై అన్న అంశంపై చర్చ జరిగిందని, తండ్రి మాట తప్పకూడదని హీరో చేసిన ప్రయత్నాలను దర్శకుడు చక్కని నేరేషన్‌తో రూపొందించారని వారు తెలిపారు. హీరోయిన్ బ్యాక్ విషయంపై చర్చ జరిగిందని, అది కమర్షియల్ ఎలిమెంట్‌గా తీశామే మరోటి కాదని వారు తెలిపారు. ట్రైల్‌రూమ్‌లో సన్నివేశాలు కూడా జస్ట్ ఓ లిబర్టీగా తీసుకుని చిత్రీకరించినవి తప్ప మరొకటి కాదు. కొంతమంది ప్రేక్షకులకు ఈ రెండు సన్నివేశాలు బాగా నచ్చాయి. ఈ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు బాగానే వుందనుకున్నాం కానీ, కొంచెం నెగెటివ్ టచ్ వినపడుతోంది. రామ్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ గ్రాస్ కలెక్షన్లతో ఈ చిత్రం రికార్డు సృష్టిస్తోందని, మాస్ సినిమాగా ప్రేక్షకులు మెచ్చుకుంటున్నారని వారు తెలిపారు. ప్యామిలీ ఎమోషన్స్ బాగా ప్రేక్షకులకు నచ్చాయని, ముఖ్యంగా తండ్రీ కొడుకులమధ్య వచ్చే సన్నివేశాలలో ఎమోషన్లు బాగా పండాయని వారు తెలిపారు. కొడుకు ఏది చేసినా తండ్రి సెంటర్‌పాయింట్‌గా చేయడం, నిజాయితీతో కూడిన గర్వమున్న అధికారిగా సత్యరాజ్ నటన, సంతకం విలువల గురించి ఈ చిత్రంలో చక్కగా చిత్రీకరించాం. ప్రతివారికి తేలికగా అర్థమయ్యేలా మాల్ అపార్ట్‌మెంట్ గూర్చి చెప్పాం. ఇప్పుడిప్పుడే కుటుంబ ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చి సినిమాకు రిపీట్ ఆడియెన్స్ వస్తున్నారు. డిస్ట్రిబ్యూటర్లు చాలా హ్యాపీగా వున్నారు. మొదటి రెండు రోజులు వర్షాలతో ఇబ్బంది ఎదుర్కొన్నమాట నిజమే. దర్శకుడు చిత్రాన్ని కేవలం నాలుగు నెలల స్పీడుతో తీశాడు. లొకేషన్లు, ఇంటర్‌కట్స్, బ్లాకులు అనేకం ఉండడంతో సినిమా రిచ్‌గా వచ్చింది. ఇటువంటి చిత్రం ఈమధ్యకాలంలో రాలేదు. నితిన్, హనురాఘవపూడి కాంబినేషన్‌లో నవంబర్‌లో ఓ చిత్రం ప్రారంభించనున్నాం అని తెలిపారు.