సిద్ధమవుతున్న విన్నర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయిధరమ్‌తేజ్, రకుల్‌ప్రీత్‌సింగ్ జంటగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో లక్ష్మీనరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు నిర్మిస్తున్న చిత్రం ‘విన్నర్’. శనివారం సాయిధరమ్‌తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, ‘జన్మనిచ్చిన తండ్రిని, మనసిచ్చిన అమ్మాయిని గెలుచుకోవడం కోసం ఓ యువకుడు చేసిన పోరాటమే ఈ సినిమా. విన్నర్ అనే టైటిల్ కథకు చక్కగా సరిపోతుందని పెట్టాం. తమన్ మంచి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఐదుపాటలు, ఒక బీట్ సాంగ్ వుంటాయి. తప్పకుండా అందరికీ నచ్చే సినిమా అవుతుంది’ అని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, ‘హీరో సాయిధరమ్‌కు తగ్గట్టే మంచి టైటిల్ కుదిరింది. ఇప్పటికే కొంత షూటింగ్ జరిపాం. ఈనెల 17 నుంచి 28 వరకు హైదరాబాద్‌లో ఒక షెడ్యూల్ జరిపి నవంబర్ 3 నుంచి 22 వరకు ఫారిన్‌లో చిత్రీకరిస్తాం. ఉక్రెయిన్, ఇస్తాంబుల్‌లో పాటలు, మిగతా చిత్రీకరణ జరుపుతాం. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 24న చిత్రాన్ని విడుదల చేస్తాం. రకుల్‌ప్రీత్‌సింగ్ నటన, గ్లామర్ ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి, శ్రీ్ధర్ శీపాన మాటలు ఆకట్టుకుంటాయి’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం:తమన్, కెమెరా:్ఛటా కె నాయుడు, ఎడిటింగ్:ప్రవీణ్‌పూడి, కథ:వెలిగొండి శ్రీనివాస్, నిర్మాతలు:నల్లమలుపు శ్రీనివాస్, ఠాగూర్ మధు, దర్శకత్వం:గోపీచంద్ మలినేని.