యువజంట వైశాఖం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జయ.బి దర్శకత్వంలో నిర్మాత బి.ఎ.రాజు, ఆర్.జె.సినిమాస్ పతాకంపై నిర్మిస్తున్న చిత్రం ‘వైశాఖం’. హరీష్, అవంతిక జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డైలాగ్ కింగ్ సాయికుమార్ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. దర్శకురాలు జయ.బి మాట్లాడుతూ- ‘ ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్‌కు ప్రాముఖ్యత ఉంది. సాంగ్స్ బాగా వచ్చాయి. వసంత్ మంచి మ్యూజిక్ అందించారు. ఎడిటింగ్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. వైశాఖం టైటిల్ విన్న అందరూ చాలా మంచి ఫీల్‌కు లోనవుతున్నారు. సినిమా చూసిన తర్వాత కూడా అదే అనుభూతికి లోనవుతారు’ అన్నారు. నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ- ‘మా బ్యానర్‌లో గతంలో విడుదలైన చంటిగాడు, గుండమ్మగారి మనవడు, లవ్‌లీ సినిమాల తరహాలో ఈ చిత్రంలో లవ్, ఎంటర్‌టైన్‌మెంట్‌తోపాటు మంచి మెసేజ్ ఉన్న చిత్రం వైశాఖం. ఈ సినిమాను తమిళం, హిందీలో విడుదల చేయాలని అందరూ అడుగుతున్నారు. కొత్త కథ వున్న సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. చిన్న చిత్రాల్లో మా వైశాఖం చిత్రం కొత్త ట్రెండ్‌ను క్రియేట్ చేస్తుంది అన్నారు. ఈశ్వరీరావు, రమాప్రభ, పృధ్వీ, కాశీవిశ్వనాధ్, కృష్ణ్భగవాన్, శ్రీలక్ష్మి, గుండు సుదర్శన్, భద్రం, సొంపు, ఫణి, మాధవి, జెన్నీ, జబర్దస్త్ టీమ్ వెంకీ, శ్రీ్ధర్, రాంప్రసాద్, తేజ, లతీష్, శృతినాయుడు, కళ్యాణి, కుమారి, మోనిక, చాందిని, ఇషాని తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం:డి.జె.వసంత్, నిర్మాత:బి.ఎ.రాజు, రచన, దర్శకత్వం:జయ.బి.