మహేష్ సినిమాకు శాటిలైట్ క్రేజ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా మురగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రస్తుతం హైద్రాబాద్‌లో షూటింగ్ జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయింది. ఈ సినిమా సాటిలైట్ హక్కుల కోసం ఏకంగా 26 కోట్లకు ఆఫర్ వచ్చిందట. నిజంగా ఈ విషయం సంచలనం అని చెప్పాలి. అది కూడా ఈ సినిమా హిందీ డబ్బిం గ్ రైట్స్‌తోపాటు తెలుగు శాటిలైట్ హక్కుల కోసం జీ సంస్థ ఈ ఆఫర్‌ని ఇచ్చిందట? మురుగదాస్ సినిమాలంటే అటు హిందీలోనూ, ఇటు సౌత్‌లోనూ భలే క్రేజ్ కాబట్టి.. ఆయన సినిమా హక్కులకోసం భారీ పోటీ నెలకొంది. ఇక మహేష్ సినిమా శాటిలైట్ హక్కులు పొందడానికి పలు టీవీ ఛానల్స్ మధ్య గట్టి పోటీ ఉండడం కామనే! అయితే ఇంకా టైటిల్ కూడా పెట్టని సినిమా కోసం ఈ స్థాయిలో పోటీ రావడం నిజంగా మహేష్-మురగదాస్‌ల కాంబినేషన్‌కు వున్న క్రేజ్ అని చెప్పాలి. ఇక తెలుగు హీరోల హిందీ డబ్బింగ్ హక్కులు కేవలం 3-4 కోట్లమధ్యే వుంటుంది కానీ ఈ సినిమా కోసం భారీగానే ఆఫర్ ఇచ్చారు. మహేష్ సినిమా సాటిలైట్ హక్కుల కోసం 21 కోట్లు పెడుతున్నట్టు, మిగిలిన ఐదు కోట్లు హిందీ డబ్బింగ్ హక్కుల కోసం ఇస్తారట. ఈ లెక్కన బాహుబలి తెలుగు సాటిలైట్ హక్కులు ఏకంగా 30 కోట్లకు అమ్ముడయ్యాయి. అంటే మహేష్ కూడా బాహుబలికి పోటీ ఇవ్వడానికి సిద్ధం అయినట్టేగా?