దీపావళికి అమెజాన్ యోధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హాలీవుడ్ స్టార్ జాకీచాన్ రూపొందించిన ‘ది లెజండరీ అమెజాన్స్’ చిత్రం తెలుగులో సాయి శ్రీజ విఘ్నేష్ ఫిలిం ప్రొడక్షన్ పతాకంపై విడుదలకు సిద్ధమైంది. జి.వంశీకృష్ణవర్మ తెలుగులో అందిస్తున్న ఈ చిత్రాన్ని ‘అమెజాన్ యోధులు’ (మాహిష్మతి రాజ్యం) అనే పేరుతో విడుదల చేస్తున్నారు. ఫ్రాంకీచాన్ దర్శకత్వంలో దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో హై టెక్నికల్ విలువలతో హాలీవుడ్‌లో రూపొందించిన ఈ చిత్రం రికార్డ్ కలెక్షన్లతో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని అక్టోబర్ 29న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత జి.వంశీకృష్ణవర్మ మాట్లాడుతూ- జాకీచాన్ రూపొందించిన ఈ సినిమా హాలీవుడ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచి సరికొత్త రికార్డులు సృష్టించిందని, బాహుబలి తరహాలో యుద్ధ సన్నివేశాలు భారీ స్థాయిలో వుంటాయని, యాక్షన్ సీన్లన్నీ థ్రిల్లింగ్‌గా సాగుతాయని అన్నారు. నిర్మాతగా తమ సంస్థకు మంచి పేరు తెస్తుందన్న నమ్మకం వుందని, ప్రతి విజువల్ గ్రాండియర్‌గా వుంటుందని, తెలుగు ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందని ఆయన అన్నారు.