రామ్‌చరణ్‌తో హరీష్ శంకర్ సినిమా?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పవన్‌కళ్యాణ్‌తో ‘గబ్బర్‌సింగ్’ సినిమా చేసి క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడు హరీష్ శంకర్ ఆ తరువాత ఎన్టీఆర్‌తో తీసిన ‘రామయ్య వస్తావయ్యా’ భారీ పరాజయాన్ని పొందడంతో కాస్త గ్యాప్ వచ్చింది. ఆ తరువాత వచ్చిన ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’ సినిమాతో హిట్ అందుకున్న ఈ దర్శకుడు మళ్లీ మెగా హీరోలతోనే సినిమాలు చేయాలనీ ఫిక్స్ అయినట్టుంది. ప్రస్తుతం అల్లు అర్జున్‌తో ‘డిజె’- దువ్వాడ జగన్నాధం చిత్రాన్ని రూపొందిస్తున్న హరీష్ తన నెక్స్ట్ సినిమా కూడా మెగా హీరోతో చేయడానికి సిద్ధం అవుతున్నాడు. ఇప్పటికే ఆయన ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు తెలిసింది. ఇంతకి ఆయన నెక్స్ట్ చేసే హీరో ఎవరో తెలుసా? రామ్‌చరణ్! రామ్‌చరణ్‌తో చర్చలు కూడా జరిపాడని తెలిసింది. మొదట పవన్, తరువాత సాయిధరమ్, ఇప్పుడు అల్లు అర్జున్, ఇక నెక్స్ట్ రామ్‌చరణ్‌తో. మొత్తానికి మెగా హీరోలతో సేఫ్‌గా లాండింగ్ ప్లాన్ చేస్తున్నాడు హరీష్. ప్రస్తుతం రామ్‌చరణ్ ‘ధ్రువ’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా తరువాత ఆయన సుకుమార్ సినిమా చేస్తున్నాడు. సో సుకుమార్ సినిమా తరువాత హరీష్ శంకర్ సినిమా మొదలు అవుతుందన్నమాట.