కష్టాల గల్ఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సునీల్‌కుమార్ రెడ్డి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గల్ఫ్’. యెక్కలి రవీందర్‌బాబు, రమణీకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చేతన్ మద్దినేని కథానాయకుడు. డింపుల్ కథానాయిక. ప్రస్తుతం గల్ఫ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. దర్శకుడు మాట్లాడుతూ, గల్ఫ్‌లో తెరకెక్కిస్తున్న తాజా షెడ్యూల్ ఈనెలాఖరుతో పూర్తవుతుందని, గల్ఫ్, రసల్ ఖైమా, షార్జా, అజ్మాల్ తదితర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నామని, ఇక్కడ క్లైమాక్స్ తప్ప మిగిలిన షూటింగ్ అంతా పూర్తవుతుందని అన్నారు. నవంబర్‌లో ఆర్‌ఎఫ్‌సిలో క్లైమాక్స్‌ను చిత్రీకరిస్తామని, అరబ్ నటులు జాసిమ్ హసన్ జుమా, అలీ, అహమద్ ఈ చిత్రంతో టాలీవుడ్‌కి పరిచయమవుతున్నారని అన్నారు. నిర్మాతలు మాట్లాడుతూ, పిడికెడు మెతుకుల కోసం పొట్ట చేతబట్టుకుని గల్ఫ్‌కి వెళ్తున్న వారి స్థితిగతులు ఎలా ఉన్నాయి? దూరపుకొండలు నునుపు అనే సామెతను మరిచిపోయి కన్నవారికి, కట్టుకున్నవారికి దూరంగా బతకాలనుకునేవారు గల్ఫ్‌లో జీవితాన్ని సుఖంగా గడుపుతున్నారా? భారంగా గడుపుతున్నారా? వంటి పలు అంశాలతో అల్లుకున్న కథే ఈ చిత్ర ఇతివృత్తమని, ముళ్ల మధ్య గులాబీలు అందంగా వికసించినట్టు వ్యథలే కథగా మిగిలినా అందులోనూ ఓ స్వచ్ఛమైన ప్రేమకథను చూపిస్తున్నామన్నారు.