నిజాలు దాచలేను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ విషయమైనా బయటకు చెప్పేవరకూ తనకు నిదరపట్టదని అంటోంది అందాల భామ రకుల్‌ప్రీత్‌సింగ్. సాధారణంగా పరిశ్రమలో చాలా విషయాలు గుట్టుగా జరిగిపోతూ వుంటాయి. ఏదీ బైటికి రానీయరు. కానీ ఈమె మాత్రం తనకు తెలిసిన ఏ విషయమైనా ఖచ్చితంగా బైటికి చెప్పేవరకూ ఊరుకోదట. ప్రస్తుతం స్టార్ హీరోల సరసన నటిస్తూ టాలీవుడ్ క్రేజీ గర్ల్‌గా ఇమేజ్ తెచ్చుకుంది. రకుల్‌ప్రీత్‌సింగ్. వరుసగా అందరి హీరోలతో సినిమా ఛాన్సులు కొట్టేసిన ఈ భామ ఓ సందర్భంగా మాట్లాడుతూ- తాను ఏ విషయాన్ని గుట్టుగా వుంచుకోనని, అన్ని చెప్పేస్తుంటానని చెప్పింది. చిన్నప్పటినుంచీ కూడా తను ఇంతేనట. ఏదైనా కొత్త విషయం తెలిస్తే అది అవతలివారికి చెప్పేంతవరకూ నిద్రపట్టేది కాదట. ప్రస్తుతం రామ్‌చరణ్ సరసన ‘ధ్రువ’ చిత్రంలో నటిస్తోన్న ఈ భామ ఈ సినిమాకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా బయటపెట్టింది. దాంతోపాటు మహేష్‌బాబు సరసన నటిస్తున్న సినిమా కూడా షూటింగ్ జరుగుతోంది. మొత్తానికి రకుల్ దగ్గర సీక్రెట్ విషయాలు మాట్లాడుకోవడానికి ఇతర సెలబ్రిటీలు జాగ్రత్తపడతారేమో!