కాజల్ ప్రేమ పాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవా, కాజల్ జంటగా డి.కె. దర్శకత్వంలో తమిళంలో ‘కావలైవేండాం’ చిత్రాన్ని తెలుగులోకి డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి.వెంకటేష్ ‘ఎంతవరకు ఈ ప్రేమ’ పేరుతో అందిస్తున్న చిత్రం ఆడియో విడుదల హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జీవా, కాజల్, కె.వి.వి.సత్యనారాయణ, రాహుల్ రవీంద్రన్, మల్కాపురం శివకుమార్, శోభారాణి, గిరిధర్, మంత్ర ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీడీని రాహుల్ రవీంద్రన్ ఆవిష్కరించారు. అనంతరం కె.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ, ఈమధ్య ప్రేమకథలు చాలా మంచి విజయాలను అందుకుంటున్నాయని, తమిళంలో రూపొందిన ఈ సినిమాను వెంకటేష్ తెలుగు ప్రేక్షకులకు అందిస్తుండడం ఆనందంగా వుందని, తప్పకుండా మంచి విజయం సాధిస్తుంది అన్నారు. సునయన మాట్లాడుతూ- ఈ సినిమాలో నటించడం ఆనందంగా వుందన్నారు. నిర్మాత శివకుమార్ మాట్లాడుతూ, అనువాద చిత్రమైనప్పటికీ నిర్మాత వెంకటేష్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చేశాడని, జీవా తెలుగులో కూడా మంచి పేరు తెచ్చుకున్నాడని అన్నారు. నిర్మాత వెంకటేష్ మాట్లాడుతూ- లియోన్ జేమ్స్ అందించిన పాటలు తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతాయని, తప్పకుండా హిట్ అవుతుందన్న నమ్మకం వుందని అన్నారు. హీరోయిన్ కాజల్ మాట్లాడుతూ, లియోన్ జేమ్స్ మంచి మ్యూజిక్ ఇచ్చారని, జీవాతో పని చేయడం ఆనందంగా వుందని అన్నారు. హీరో జీవా మాట్లాడుతూ, మా హృదయాల్ని ఆకట్టుకున్న ఈ సినిమా ప్రేక్షకులకూ నచ్చుతుందన్నారు.