ప్రేమకు చోటులేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్లామర్ భామ హన్సిక ప్రస్తుతం కోలీవుడ్‌లో బిజీగా వుంది. వరుస అవకాశాలతో స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తున్న ఈమె, టాలీవుడ్‌లో కూడా గట్టి ప్రయత్నాలే చేస్తోంది. ప్రస్తుతం తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తోన్న హన్సిక, తాజాగా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఓ సందర్భంగా తన జీవితంలో ప్రేమకు ఎలాంటి ప్రాధాన్యత లేదని, ప్రేమా గీమా జాంతానై అని చెబుతోంది. ఓవైపు హీరోయిన్లు తమకు నచ్చినవాళ్లతో ప్రేమయాణాలు సాగిస్తూ జోరుమీదుంటే, హన్సిక మాత్రం దానికి రివర్సుగా కామెంట్ చేయడం సంచలనం రేపుతోంది. దానికి కారణం లేకపోలేదు. ఆమధ్య ఈమె తమిళ్ హీరో శింబుతో ప్రేమాయణం సాగించింది. ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. పెళ్లి కూడా చేసుకునేంతవరకూ వెళ్లిన కథ సడెన్‌గా ఆగిపోయింది. దానికి కారణం శింబు మాజీ లవర్ నయనతారతో మళ్లీ దగ్గరవుతుండడమే కారణం. ఆ వ్యవహారంతో శింబు కూడా నయనతారకు ప్రాధాన్యత ఇచ్చి హన్సికకు హ్యాండిచ్చాడు. దాంతో ప్రేమలో విఫలమైన హన్సిక తన జీవితంలో ప్రేమే లేదని చెబుతోంది.