కాష్మోరా నచ్చింది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కార్తి, నయనతార, శ్రీదివ్య హీరో హీరోయిన్లుగా గోకుల్ దర్శకత్వంలో పి.వి.పి సినిమా, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకాలపై రూపొందిన ‘కాష్మోరా’ మంచి టాక్‌తో రన్ అవుతోంది. ఈ చిత్రం మొదటిరోజే 5 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి కార్తి కెరీర్‌లో బెస్ట్ చిత్రంగా నిలిచింది. ఈ సందర్భంగా నిర్మాత ప్రసాద్ వి.పొట్లూరి చెప్పిన విశేషాలు.. ఈ ఏడాది మా బ్యానర్ నుండి వచ్చిన నాలుగు చిత్రాలు క్షణం, ఊపిరి, బ్రహ్మోత్సవం, కాష్మోరా సినిమాలు విడుదలయ్యాయి. పిల్లలు, మహిళలు ఎక్కువగా కాష్మోరాను ఆదరిస్తున్నారు. సినిమాకు విజువల్ ఎఫెక్ట్స్ హైలెట్‌గా నిలిచాయి. రెండు పాత్రల్లో కార్తి ఆకట్టుకున్నాడు. ఊహించినదానికంటే కూడా మంచి రిజల్ట్ వచ్చింది. ఏదైనా సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ మనకు చాలా విషయాలు నేర్పుతాయి. అందుకని సినిమా ప్రమోషన్ విషయంలో ఎక్కువ శ్రద్ధ తీసుకున్నాం. ఊపిరి సినిమాతోపాటే కాష్మోరా చిత్రాన్ని ప్రారంభించాం. అప్పటినుంచి కార్తితో మాకు రిలేషన్ కొనసాగుతోంది. ఈ సినిమాను బాహుబలితో పోల్చకూడదు. మగధీర, ఈగ, బాహుబలి సినిమాలతో తెలుగు పరిశ్రమను మరింత ముందువరుసలో రాజవౌళి నిలబెట్టాడు. ‘బ్రహ్మోత్సవం’ విషయంలో కొన్ని పొరపాట్లు జరిగాయి. దక్షిణాదిలో సినిమాల్లోకి కార్పొరేట్ సంస్కృతి ఎంటరైంది మాతోనే. కొన్ని విషయాల్లో పొరపాట్లు జరుగుతుంటాయి. ఏ నిర్మాతకైనా పెద్ద హీరో, పెద్ద దర్శకుడితో సినిమా చేయాలనే వుంటుంది. అలాంటి సమయంలోనే కొన్ని లోపాలు జరుగుతుంటాయి. వచ్చే ఫిబ్రవరి 24న హిందీ ఘాజి చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళంలో విడుదల చేస్తున్నాం. ఇండియా-పాకిస్తాన్ మధ్య యుద్ధ నేపథ్యంలో రూపొందించిన సినిమా ఇది. రానా, అతుల్‌కులకర్ణి, కె.కె.మీనన్, తాప్సి నటించారు. దాంతోపాటు ఓంకార్ దర్శకత్వంలో ‘రాజుగారి గది-2’ చిత్రాన్ని నాగార్జున హీరోగా చేస్తున్నాం. మహేష్‌బాబుతో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో మరో చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు.