రోబో 2.0లో ఒకే ఒక్క పాట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూపర్ స్టార్ రజనీకాంత్, సౌత్ ఇండియా టాప్ డైరెక్టర్ శంకర్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘రోబో 2.0’. గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన ‘రోబో’ చిత్రం ఘన విజయం సాధించడంతో ఈ ప్రాజెక్టుపై భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు తగ్గట్టే శంకర్ అన్నివిధాలా ఈ సినిమాని చాలా ఖచ్చితత్వంతో రూపొందిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రంలో రజనీకాంత్‌పై కేవలం ఒకే ఒక్క పాట ఉంటుందట. అది కూడా డ్యూయెట్ అని, అందులో రజనీతోపాటు అమీ జాక్సన్ కనిపిస్తుందట. ఈ పాటను ఇప్పటికే ఉక్రెయిన్‌లో చిత్రీకరించేశారు. ఈ పాట కాకుండా ఆడియో ట్రాక్‌లో మరో 4 లేదా 5 పాటలు ఉంటాయని అవన్నీ సినిమాలోని కీలక సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్‌లో నడిచే పాటలని తెలుస్తోంది. ఏఆర్ రెహమాన్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంలో రజనీకి విలన్‌గా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానుంది.