నరుడా..డోనరుడా మసాలా చిత్రం కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘నరుడా.. డోనరుడా’ అనే పేరు సినిమాకు పెట్టినప్పుడు ఇదేదో మసాలా చిత్రం అనుకున్నారని, కానీ సినిమా చూశాక ఈ విషయం తప్పని నిరూపిస్తుందని నటుడు సుమంత్ తెలిపారు. సుమంత్ కథానాయకుడుగా రూపొందించిన నరుడా.. డోనరుడా చిత్రం ఈనెల 4న విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆయన చిత్ర విశేషాలను తెలిపారు.
అందుకే గ్యాప్
కావాలని ఈ సినిమాకోసం గ్యాప్ తీసుకోలేదు. పక్కా కమర్షియల్ ఎంటర్‌టైన్‌మెంట్స్ చేయడం నాకు నచ్చదు. అలా మంచి చిత్రం చేద్దామనుకున్న సమయంలో ‘విక్కీడోనర్’ కనిపించింది. అయితే తాతగారు దూరమవ్వడంతో కొన్నాళ్లు ఖాళీగా కూర్చున్నా. ‘విక్కీ డోనర్’ హక్కులు ఎవరో తీసుకున్నారని తెలియడంతో సరికొత్త కథలకోసం వెతికాను. ఆ తర్వాత నిర్మాత జాన్‌అబ్రహంను సంప్రదిస్తే ఆ హక్కులు ఎవరూ తీసుకోలేదని తెలిసింది. ఈ సినిమా ఓ బలమైన ఎమోషన్‌తోపాటు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ఉండేలా చిత్రీకరించారు. నాకు కూడా అది నచ్చింది.
ఇంత బోల్డ్ అవసరమా?
ట్రైలర్ పోస్టర్‌తోనే సినిమా బోల్డ్ అని తెలిసింది. ఇంకా అలాంటి భయం ఎప్పుడూ లేదు. ఇది యూనివర్సల్ కథ. ఇంకా చెప్పాలంటే బాలీవుడ్‌లో మల్టీఫ్లెక్స్ సినిమాగా మాత్రమేకాక అంతటా ఆడింది. ఇక్కడ కూడా ఆడుతుందన్న నమ్మకం వుంది. పక్కాగా అందరూ చూసే సినిమా ఇది. ఎక్కడా వల్గారిటీ, అడల్ట్ కంటెంట్ ఉండదు. సెన్సార్‌బోర్డు కూడా యు/ఏ రేటింగ్ ఇచ్చారు. ఇది హాట్ సినిమానో, ఏ రేటెడ్ సినిమా అయితే కాదు. కనీసం ఒక్క లిప్‌లాక్ సన్నివేశం లేదు.
ప్రొడక్షన్ చూసుకున్నా
నిజం చెప్పాలంటే ఈ సినిమాలో నేను, తనికెళ్ల భరణి తప్ప మిగతా అందరూ కొత్తవారే. వాళ్లందర్నీ ఒక టీమ్‌గా చేసుకొని ప్రొడక్షన్ చేయడం పెద్ద బాధ్యతే. ఈ సినిమాను కొత్తవాళ్లతో చేయాలని అనుకున్నప్పుడే విజయం వరించింది. వారంతా కొత్త టెక్నీషియన్స్. కొత్త ఐడియాలతో వస్తారు. దర్శకుడు మల్లిక్ దగ్గర్నుంచి అందరూ తమ స్టామినా చూపేలా పనిచేశారు.
పెళ్లి ఆలోచన
అఖిల్, చైతన్యల పెళ్లికి వెళ్లడమే కానీ నేను పెళ్లిచేసుకోదలుచుకోలేదు. ఇప్పుడంతా బాగానే వుంది కదా? ఇలా సినిమాలు చేసుకుంటూ సాగిస్తా. అందరూ పెళ్లిచేసుకోవాలని ఏమీ రూలు లేదుగా?
తదుపరి చిత్రాలు
ఇంకా అలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోలేదు. ప్రస్తుతానికి కథలు వింటున్నా. ఏది ఫిక్సవుతుందో చూడాలి. విలన్‌గా చేయడమంటే చాలా ఇష్టం. చాలాసార్లు ఇదే విషయం చెప్పినా అలాంటి అవకాశాలు రాలేదు. వస్తే చేయడానికి సిద్ధం.

- శ్రీ