కౌబోయ్‌గా చరణ్?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రామ్‌చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న ‘ధ్రువ’ సినిమా షూటింగ్ పూర్తికావచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్‌లో విడుదల చేస్తారని అంటున్నారు. ఇక ఈ సినిమా తరువాత సుకుమార్ దర్శకత్వంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తరువాత సినిమాకు అప్పుడే ప్లాన్ చేస్తున్నాడట చరణ్. ఈసారి ఆయన కౌబోయ్‌గా కనిపించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. దానికి కారణం లేటెస్టుగా ఓ దర్శకుడు చరణ్‌కు మంచి కౌబోయ్ కథ వినిపించాడట! కథ బాగా నచ్చిన చరణ్ ఇంకా దాన్ని పూర్తిస్థాయిలో రెడీ చేసుకుని రమ్మన్నాడట. ఆ దర్శకుడు ఇప్పుడు అదే పనిలో ఉన్నాడు. ఇక టాలీవుడ్‌లో కౌబోయ్ సినిమాలంటే గుర్తొచ్చేది కృష్ణ.. ఆ తరువాత మహేష్‌బాబు. ఇప్పుడు రామ్‌చరణ్ కూడా కౌబోయ్‌గా ఆకట్టుకునేందుకు సిద్ధం అవుతున్నాడు. మరి కౌబోయ్‌గా చరణ్ ఎలా కన్పిస్తాడా అనే ఆసక్తి ఇప్పుడే మెగా ఫాన్స్‌లో నెలకొంది?