పాటలు పాడిన రెమో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శివకార్తికేయన్, కీర్తి సురేష్ జంటగా 24ఎంఎం స్టూడియోస్, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై రాజు, డి.ఆర్.రాజా అందిస్తున్న చిత్రం ‘రెమో’. భాగ్యరాజ్ కన్నన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి సంబంధించిన ఆడియోను, థియేటర్ ట్రైలర్‌ను హైదరాబాద్‌లో నటి సమంత విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డౌన్ టు ఎర్త్‌గా ఉండే శివకార్తికేయన్ సూపర్‌స్టార్‌గా ఎదుగుతారని, ఈ సినిమా తమిళంలో పెద్ద హిట్ అయిందని అన్నారు. తమిళంలోకన్నా తెలుగులో పెద్ద హిట్‌గా నిలవాలని, అనిరుథ్ మంచి సంగీతాన్ని అందించారని, డిఫరెంట్ స్టోరీ ఈ చిత్రంలో ఏదీ లేకపోయినా, డిఫరెంట్ ట్రీట్‌మెంట్ ఉందని కథానాయకుడు శివకార్తికేయన్ అన్నారు. ఈ నెలలోనే రానున్న విడుదల కానున్న ఈ చిత్రం తెలుగులో సూపర్ హిట్ అవుతుందన్న నమ్మకం వుందని, శివకార్తికేయన్ వేసిన రెమో అనే లేడీ గెటప్ అందర్నీ ఆకట్టుకుంటుందని నిర్మాత అన్నారు. ఈ సినిమా సక్సెస్‌లో కీర్తి నటన ప్రత్యేకమని, ఓ అనుభవం ఉన్న దర్శకుడిలా తెరకెక్కించిన భాగ్యరాజును అభినందిస్తున్నానని, సంగీత దర్శకుడు అనిరుథ్ అన్నారు. కార్యక్రమంలో పి.సి.శ్రీరామ్, కీర్తిసురేష్, కె.ఎస్.రవికుమార్, రాజేష్, శరణ్య తదితరులు పాల్గొని చిత్ర విశేషాలను తెలిపారు.